Amanda Bynes Hospitalised After Seen Roaming In Los Angeles Naked: ఆమె ఒక హీరోయిన్. కొన్ని సినిమాల్లో నటించి.. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించింది. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు.. కెరీర్ బాగానే ఉంది. కానీ.. ఆమె మానసిక పరిస్థితే సరిగ్గా లేదు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటుంది. గతంలో తన పక్కింటిని నిప్పంటించడం, పెంపుడు కుక్కను చంపాలని ప్రయత్నించింది. ఇప్పుడు.. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా, నగ్నంగా నగర వీధుల్లో చక్కర్లు కొట్టింది. దీంతో.. పోలీసులు ఆ నటిని అదుపులోకి తీసుకొని, పిచ్చాసుపత్రిలో చేర్పించింది. ఆ నటి పేరు అమాండా బైన్స్. ఈమెకు 36 సంవత్సరాలు. ఎక్కడి నుంచి కారులో వచ్చిందో తెలీదు కానీ.. లాస్ డౌన్‌టౌన్ సమీపంలో తన కారుని ఆపి, ఒంటిపై బట్టలు లేకుండా కారు దిగింది. అక్కడి వీధుల్లో కాసేపు సంచరించి, హల్‌చల్ సృష్టించింది. దారిలో వచ్చిపోయే వారిపై నోరుపారేసుకుంది.
5 Years’ Salary As Bonus: ఉద్యోగులకు ఐదేళ్ల జీతం బోనస్‌గా.. ఇదే కదా బంపరాఫర్ అంటే
ఇది గమనించిన పోలీసులు.. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని, అమాండాని అదుపులోకి తీసుకున్నారు. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతోందన్న విషయం తెలిసి, సైకియాట్రిస్ట్ నిపుణుల సూచనతో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం 72 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో అమాండా ఉంది. ఆ సమయంలోపు పరిస్థితి అదుపులోకి రాకపోతే.. ఇంకొన్ని రోజుల పాటు ఆమెని అక్కడే ఉంచాలని నిర్ణయించారు. అమాండా అప్పుడప్పుడు ఇలా ప్రవర్తించడానికి ఒక బలమైన కారణం ఉంది. గతంలో ఈమె డ్రగ్స్ ఎక్కువగా తీసుకునేది. తానే స్వయంగా ఓ ప్రకటనలో.. తాను గతంలో డ్రగ్స్‌కు బానిసయ్యానని, దాన్నుంచి బయటపడ్డానని తెలిపింది. దాని ప్రభావం వల్లే.. అప్పుడప్పుడు ఈ అమ్మడు చాలా వింతగా, విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. కాగా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన అమాండా ఈజీ ఏ, షీ ఈజ్ ది మ్యాన్, వాట్ ఏ గర్ల్ వాంట్ వంటి సినిమాల్లో నటించింది.