5 Years’ Salary As Bonus: కొన్ని సంస్థల్లో ఏళ్ల తరబడి బోనస్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటుంది.. మరి కొన్ని సంస్థలు వారి లాభాలను బట్టి ఉద్యోగులకు ఎప్పటికప్పుడు గుడ్‌న్యూస్ చెబుతూ.. వారికి తోడుగా ఉంటుంది.. తాజాగా, తైవాన్ షిప్పింగ్ దిగ్గజం ఎవర్‌గ్రీన్ తన 3100 మంది ఉద్యోగులకు భారీ బోనస్‌లను అందజేస్తోంది. గత డిసెంబర్‌లో ఉద్యోగులకు 52 నెలల జీతం వరకు ఇయర్-ఎండ్ బోనస్‌లతో రివార్డ్ చేసిన తర్వాత, షిప్పింగ్ దిగ్గజం ఇప్పుడు తమ సిబ్బందికి వారి 2022 పనితీరు కోసం మరో 10 నుండి 11 నెలల జీతం విలువైన మిడ్-ఇయర్ బోనస్‌లను ఇస్తుందని స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. ఇది 2022కి ఐదు సంవత్సరాల జీతం కంటే బోనస్ ద్వారా వచ్చే మొత్తం ఎక్కువగా కావడం విశేషం.. ఎవర్‌గ్రీన్ కార్మికుల వ్యక్తిగత పనితీరును బట్టి బోనస్‌లు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.. కంపెనీ భారీ మొత్తంలో $94 మిలియన్లు ఖర్చు చేస్తోంది. ఈ నగదును మిడ్-ఇయర్ బోనస్‌ల ద్వారా కార్మికులకు అందించనుంది.
Read Also: Beach Corridor Project: బీచ్ కారిడార్ గ్రీన్ బెల్ట్ నిబంధనల్లో మార్పులు.. నోటిఫికేషన్ జారీ
కాగా, కరోనా మహమ్మారి సమయంలో సూయిజ్ కెనాల్‌లో ఎవర్‌గ్రీన్ సంస్థకు చెందిన భారీ నౌక చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.. దీంతో కొన్ని రోజుల పాటు ఆ మార్గంలో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. అయితే, కరోనా కాలంలో భారీ నష్టాలను ఎదుర్కొన్న సంస్థ ఆ.. తర్వాత మళ్లీ లాభాల బాటపట్టింది.. గత రెండేళ్లుగా 39.92 శాతం మేర లాభాలను ఆర్జిస్తోంది. ఉద్యోగుల కృషిఫలితంగానే ఇంత భారీగా లాభాలు వచ్చాయని భావించని ఆ సంస్థ.. ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు ఆధారంగా బోనస్‌లు ఇస్తుంది.. ఇక, ఎవర్‌గ్రీన్‌లో వార్షిక వేతనాలు 29, 545 డాలర్ల నుంచి 114,823 డాలర్ల మధ్య ఉంటాయి. డిసెంబర్ 31, 2022తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఈ వారం రికార్డు స్థాయిలో 14.7 బిలియన్ డాలర్ల నికర లాభాన్ని నమోదు చేసింది . ఇది సంవత్సరానికి 39.82 శాతం పెరుగుదల కావడం విశేషం.. దీంతో.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెబుతూ బంపరాఫర్ ప్రకటించింది.. అయితే, ఐదేళ్ల బోనస్ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఎవర్‌గ్రీన్ మెరైన్ ఉద్యోగులను చూసి తమ అసూయను వ్యక్తం చేస్తున్నారు.. ఆ సంస్థ ఉదారతపై ప్రశంసలు కురిపిస్తున్నారు..