గుమ్మడికాయ జ్యూస్ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగించడంతో పాటు అలసట, నీరసాన్ని దూరం చేస్తుంది. 

గుమ్మడికాయ రసంలో ఉండే విటమిన్ డి, కాపర్, ఐరన్, ఫాస్పరస్.. శరీరానికి మరిన్ని పోషకాలను అందిస్తాయి.

ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి.. మలబద్ధకం, అల్సర్, గ్యాస్‌ను నయం చేయడంలో సహాయపడుతుంది. 

గుమ్మడికాయ రసం.. మూత్ర వ్యవస్థను బలోపేతం చేసి, యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో తోడ్పడుతుంది.

గుమ్మడికాయ రసంలో తేనె కలిపి తాగితే.. మంచి నిద్ర వస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

గుమ్మడికాయ రసంలోని పొటాషియం.. జుట్టు రాలే సమస్యని తగ్గించి, జుట్టు పెరగడానికి దోహదపడుతుంది.

ఇందులోని పాలీశాకరైడ్స్, ప్యూరరిన్.. రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గించి, మధుమేహాన్ని నిరోధిస్తుంది.

గుమ్మడికాయ రసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇది ముడతలు, డార్క్ స్పాట్స్, వృద్ధాప్య చిహ్నాలను తగ్గించి.. అందమైన చర్మాన్ని అందిస్తుంది.

గుమ్మడికాయ రసం తరచూ తాగడం వద్ద.. అధిక రక్తపోటును తగ్గించవచ్చు.