Israel-Hamas War: ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధం ప్రారంభమై నెల దాటుతున్నా.. ఇప్పటికి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా వేలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. కాగా తాజాగా గురువారం వెస్ట్ బ్యాంక్ లోని జెనిన్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైనికులు దాడి చేశారు. ఈ దాడులు 12 గంటలకు పైగా కొనసాగినట్లు సమాచారం. కాగా ఈ దాడిలో 14 మంది మరణించారు. ఈ విషయాన్ని గాజాకు చెందిన పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే మరణించింది పౌరుల లేక ఉగ్రవాదుల అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) మాట్లాడుతూ.. ఆగస్ట్ 31 జరిగిన ర్యామ్మింగ్ దాడిలో ఆఫ్ డ్యూటీ ఇజ్రాయెల్ సైనికుడిని చంపేశారని.. ఆ సైనికుడిని చంపిన వ్యక్తి ఇంటిని కూల్చేందుకు అలానే ఉగ్రవాద అవస్థాపనను అడ్డుకోవడానికి ఈ ఆపరేషన్ నిర్వహించామని పేర్కొన్నారు.
Read also:TTD: హాట్ కేకుల్లా వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విక్రయం.. నిమిషాల వ్యవధిలోనే పూర్తి
కాగా మక్కాబిమ్ చెక్‌పాయింట్, హష్మోనైమ్ చెక్‌పాయింట్ వద్ద తొక్కిసలాట దాడికి పాల్పడిన ఉగ్రవాది ఇంటిని కూల్చివేసే ఉత్తర్వుపై సెంట్రల్ కమాండ్ కమాండర్ సంతకం చేశారు అని.. అలానే జెనిన్ శరణార్థి శిబిరంలో తమ బలగాలకు హాని కలిగించే ఉద్దేశంతో ఇంజనీరింగ్ దళాలు పేలుడు పరికరాలను ఉపయోగించేందుకు చూశాయని ఈ నేపధ్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించామని మిలటరీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా అనిన్ (జెనిన్), బెత్లెహెం నగరం, బలాటా శరణార్థి శిబిరం (నాబ్లస్), అల్ అమారీ శరణార్థి శిబిరాల పైన గురువారం జరిగిన ఘర్షణల్లో మరో ఐదుగురు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.