TTD: హాట్ కేకుల్లా వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విక్రయం.. నిమిషాల వ్యవధిలోనే పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. ఇక, ప్రత్యేక రోజుల్లో అయితే.. ఇక చెప్పాల్సిన అవసరం లేదు.. అదే వైకుంఠ ద్వారా దర్శనం అయితే.. తిరుమల గిరులు అన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి.. ఏడు కొండలు గోవందనామస్మరణతో మార్మోగుతాయి.. ఇప్పటికే వైకుంఠద్వారా దర్శనం షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేయగా.. ఈ రోజు వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టింది.. అయితే, హాట్ కేకుళ్లా.. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే టికెట్లు మొత్తం విక్రయించింది తిరుమల తిరుపతి దేవస్థానం..
Read Also: Komatireddy Rajgopalreddy: పరుగులు పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వీడియో వైరల్
Also Read
డిసెంబర్ 23వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్టు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది.. ఇక, ఆ సమయంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులకు ప్రత్యేకంగా 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్ల కోటాను ఈ రోజు ఆన్‌లైన్‌లో పెట్టింది.. ఈ వైకుంఠ ద్వార దర్శన టికెట్లు డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు వర్తించనుండగా.. రోజుకి 22,500 టికెట్ల చొప్పున మొత్తం 2.25 లక్షల టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.. అయితే, హట్ కేకుల్లా వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విక్రయం అయ్యాయి.. టికెట్లు విడుదల చేసిన 14 నిమిషాల వ్యవధిలోనే 80 శాతం టికెట్లు విక్రయాలు పూర్తి కాగా.. 16 నిమిషాల వ్యవధిలోనే 2 లక్షల టికెట్లు.. 17 నిమిషాల నిముషాల వ్యవధిలోనే 90 శాతం టికెట్ల విక్రయాలు పూర్తి కాగా.. 21 నిమిషాల వ్యవధిలో పూర్తిస్థాయిలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టికెట్ల విక్రయాలు పూర్తి అయ్యాయి.. వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి 6.75 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు