విజయ్ సెట్లో ఉన్న స్టార్ హీరోని గుర్తుపట్టలేదట !

తలపతి విజయ్ సెట్ లో ఉన్న మరో స్టార్ హీరోను గుర్తు పట్టలేకపోయాడట. ప్రస్తుతం విజయ్ “బీస్ట్” చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా… వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు తమిళ స్టార్ హీరో కార్తీ “సర్దార్” అనే విభిన్నమైన చిత్రంలో నటిస్తున్నాడు. పీఎస్ మిత్రన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరినీ సప్రైజ్ చేశాడు కార్తీ. ‘సర్దార్’ ఫస్ట్ లుక్ పోస్టర్లో పొడవాటి గడ్డంతో ఉన్న వృద్ధుడిగా కార్తీ అద్భుతమైన మేకోవర్ ఈ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది. కోలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన కార్తీని “సర్దార్” గెటప్ లో చూసి తలపతి విజయ్ గుర్తించలేకపోయాడు.

Read Also : కాస్త ముందుగానే రానున్న “నారప్ప”

విజయ్ ‘బీస్ట్’, కార్తీ ‘సర్దార్’ చిత్రీకరణ చెన్నైలోని గోకులం స్టూడియోలో జరుగుతోంది. మరో చిత్రం “సర్దార్” అక్కడే షూటింగ్ జరుపుకుంటున్నట్టు సమాచారం అందడంతో కార్తీని విజయ్ మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలుస్తోంది. అయితే సెట్లోకి వెళ్లిన విజయ్ కు కార్తీ ఎక్కడ ఉన్నాడో కన్పించలేదట. కార్తినే స్వయంగా తనను తాను పరిచయం చేసుకోవాల్సి వచ్చిందట. “సర్దార్” గెటప్ లో ఉన్న కార్తీని విజయ్ గుర్తుపట్టలేదట. అతని గెటప్ చూసి షాకైన వెంటనే కార్తీని కౌగిలించుకున్నాడు. ఇక టీంను కలిసిన విజయ్ వారికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-