తెలంగాణలో సంచలనం కలిగించిన వికారాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచారం, హత్ కేసు కొలిక్కి వస్తోంది. తానే హత్య చేసినట్టు ప్రియుడు మహేందర్ (నాని) పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. హత్య జరిగిన రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు యువకుడు. ఉదయం మూడు నుండి నాలుగు గంటల ప్రాంతంలో బయటకు రమ్మని బాలికకు ఫోన్ చేశాడు ప్రియుడు. ఊరి చివరన నిర్మాణుష్య ప్రాంతంలో కలుసుకున్నారు ఇద్దరు.
శారీరకంగా కలవాలని బాలికను కోరాడు యువకుడు. అయితే ప్రతిఘటించింది బాలిక. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దీంతో బాలికను బలంగా నెట్టాడు యువకుడు. పక్కనే ఉన్న చెట్టుకు తల తగిలి మూర్చపోయింది బాలిక. మూర్చపోయిన బాలికను శారీరకంగా అనుభవించాడు యువకుడు. బాలిక శరీరంలో చలనం లేకపోవడంతో విషయం బయటపడుతుందని ఆత్రుతతో గొంతు నులిమి హత్య చేశాడు. తనకేమీ తెలియనట్టు ఇంటికి వెళ్లి పడుకున్నాడా యువకుడు.
హత్య జరిగిందని హడావిడి కావడంతో అందరితో కలిసి ఘటనాస్థలికి వెళ్ళాడు యువకుడు. ఈ కేసులో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయం 5:47 కు బహిర్భుమికి వెళ్ళిందని చెబుతోంది బాలిక తల్లి. అయితే, బాలిక తల్లి మాటలకు,ప్రియుడి మాటలకు పొంతన కరువు అయింది. ఓ వ్యక్తి ఘటనాస్థలి నుండి పరిగెత్తాడని చెబుతున్నారు స్థానికులు. ఈ చిక్కుముడి వీడితే కొలిక్కి రానున్న బాలిక హత్య కేసు కొలిక్కి వస్తుంది.