Tamil Nadu: ఒక మహిళను హత్య చేసి, పూడ్చి పెట్టేందుకు గొయ్యి తవ్వుతుండగా ఇద్దరు నిందితులు పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో జరిగింది. హైవే వెంట పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఓ కారులో మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహాన్ని పూయ్చేందుకు గొయ్యి తవ్వుతుండా, ఇద్దరు అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. అమ్మైనికనూర్ పోలీసులు సమచారం ప్రకారం.. ఇద్దరు నిందితులును అరెస్ట్ చేసి, మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
Read Also: Voter Slip: మీరు ఇంకా ఓటర్ స్లిప్ తీసుకోలేదా.. టెన్షన్ వద్దు! మొబైల్‌లోనే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
నిందితులను దివాకర్(24), అతని బంధువు ఇంద్రకుమార్(31)గా గుర్తించారు. 27 ఏళ్ల ప్రిన్సీ అనే బాధితురాలు తిరుప్పూర్‌లోని ఓ ప్రైవేట్ మిల్లులో పనిచేస్తోంది. ఆమెకు దివాకర్‌తో పరిచయం ఏర్పడింది. దివాకర్, ప్రిన్సీలు రిలేషన్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, వీరి వివాహేతర సంబంధం వ్యవహారం దివాకర్ భార్య ఉమాభారతికి తెలియడంతో ప్రిన్సితో సంబంధాన్ని తెంచుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే దివాకర్‌ని డబ్బు, నగలు అడుగుతూ ప్రిన్సి వేధించేదని తెలిసింది.
దీంతో కోపంతో ప్రిన్సిని దివాకర్ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో తనకు బంధువైన ఇంద్రకుమార్‌ని ఓమ్నీ వ్యాన్ తీసుకుని రావాలని కోరారు. ప్రిన్సీకి గిఫ్ట్ ఇచ్చే నెపంతో ఇద్దరు ఆమె గొంతు నులిమి హత్య చేశారు. హత్య తర్వాత ఇంద్ర కుమార్ మృతదేహాన్ని కారులో తరలించగా, రామనాథపురం నుంచి బైకుతో కారును ఫాలో అయ్యాడు. ప్రిన్సీ మృతదేహాన్ని మధురై సమీపంలో పూడ్చిపెట్టాలని ఇద్దరు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే పెట్రోలింగ్ అధికారులు కోడై రోడ్డు సమీపంలో పార్క్ చేసిన కారును తనిఖీ చేయగా వారి ప్లాన్ విఫలమైంది. ఇద్దరిని అరెస్ట్ చేసి, తదుపరి విచారణ చేస్తున్నారు.