Voter Slip: మీరు ఇంకా ఓటర్ స్లిప్ తీసుకోలేదా.. టెన్షన్ వద్దు! మొబైల్‌లోనే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Voter Slip Download Options: తెలుగు రాష్ట్రాల్లో సోమవారం (మే 13) పోలింగ్ జరగనుంది. ఓటు వేయడానికి ‘ఓటర్ స్లిప్’ చాలా ముఖ్యం అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే.. పోలింగ్ సెంటర్ ఎక్కడ?, పోలింగ్ స్టేషన్‌లో మన రూమ్ నంబర్, సీరియల్ నంబర్ లాంటి వివరాలు ఈ ఓటర్ స్లిప్‌లో ఉంటాయి. ఈ వివరాలు తెలిస్తే.. ఓటు వేసేయడం చాలా సులభమవుతుంది. అందుకే ఎన్నికల సమయంలో ఓటర్ స్లిప్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే మీకు ఈ ఓటర్ స్లిప్ అందలేదా?. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మొబైల్ ద్వారానే ఓటర్ స్లిప్‌ను ఆన్‌లైన్‌లో ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముందుగా మీ మొబైల్‌లో బ్రౌజర్ ఓపెన్ చేయాలి. గూగుల్‌లో https://electoralsearch.eci.gov.in/ ఎంటర్ చేయాలి. ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు మూడు ఆప్షన్లు వస్తాయి. ఓటర్ ఐడీ, మొబైల్ నంబర్, పేరు, ప్రాంతం వంటి వివరాలను ఎంటర్ చేయాలి. అప్పుడు మీ ఓటర్ స్లిప్ కనిపిస్తుంది. పీడీఎఫ్ రూపంలో ఓటర్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆపై ఓటర్ స్లిప్‌ను ప్రింట్ తీసుకుంటే చాలు. అందులో మీ పోలింగ్ బూత్ వివరాలు కూడా ఉంటాయి.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
మొబైల్ యాప్ ద్వారా ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ లేదా యాపిల్ మొబైల్‌లో ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో ఎలక్టోరల్ రోల్ సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి.. వివరాలు నమోదు చేయడం చేయాలి. అప్పుడు ఓటర్ స్లిప్ పొందవచ్చు. మొబైల్ యాప్‌లో క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఓటర్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ ఓటర్ ఐడీపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా.. ఓటర్ స్లిప్‌ను పొందవచ్చు.
Also Read: RCB vs DC: మమ్మల్ని ఓడించడం ఢిల్లీకి కష్టమే: బెంగళూరు కోచ్
మెసేజ్ ద్వారా కూడా ఓటర్ స్లిప్ పొందవచ్చు. ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ ఐడీ టైప్ చేసి 1950 నంబర్‌కు మెసేజ్ చేయాలి. వెంటనే మీ పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ వంటి సమాచారం మొబైల్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది. పై మూడు విధాలుగా మీ ఓటర్ స్లిప్ సులువుగా పొందవచ్చు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..