Triple Talaq: వరకట్న వేధింపులు ఎదుర్కొంటున్న ఒక మహిళ తనువు చాలించింది. పెళ్లయినప్పటి నుంచి అత్తమామలు కట్నం కోసం వేధించడంతో పాటు భర్త ఇటీవల ఫోన్‌లో ‘‘ట్రిపుల్ తలాక్’’ చెప్పడంతో సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. భర్త ట్రిపుల్ తలాక్ ఇవ్వడంతో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.
ఈ వ్యవహారంలో వరకట్న వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడంలో విఫలమైన ఎస్‌ఐని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. సోమవారం మహిళకు మహారాష్ట్రలో నివసిస్తున్న తన భర్త నుంచి ఫోన్ వచ్చింది. దీని తర్వాత సానియా తన గదిలో ఉరి వేసుకుంది. శనివారమే ఆమె గోరఖ్‌పూర్‌లోని తల్లిగారి ఇంటికి వచ్చింది.
Read Also: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్.. సాంకేతిక కారణాలతో నిలిచిన ట్రైన్స్
బాధితురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు తీసుకోవడంలో అలసత్వం వహించిన ఎస్ఐ జయ ప్రకాష్ సింగ్‌ని సస్పెండ్ చేస్తూ సీనియర్ ఎస్పీ గౌరవ్ గ్రోవర్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ప్రకారం, సానియా తత్లి ఆసియా ఆమె అత్తామామలపై చౌరా చౌరీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, ఎస్ఐ ఈ ఫిర్యాదుని తోసిపుచ్చారు. కేసు నమోదు చేయలేదు. దీంతో అతడిని సస్పెండ్ చేశారు.
మహారాష్ట్ర రసాయని ప్రాంతానికి చెందిన సానియా భర్త సలావుద్దీన్‌తో సహా 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సోమవారం సాయంత్రం ఫోన్ కాల్ ద్వారా సలావుద్దీన్ ట్రిపుల్ తలాక్ చెప్పాడని, ఆ కాల్‌లో సానియాని తీవ్రంగా తిట్టడంతో, ఆమె మనస్తాపానికి గురై రాత్రి ఆత్మహత్య చేసుకుందని ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. సానియాకు సలావుద్దీన్‌తో ఆగస్టు 7, 2023న వివాహం జరిగింది. అయితే, సానియాను ఆమె భర్త, అతని తల్లి సైరా, వదినలు ఆసియా, ఖుష్బూ, రోజీ, మరిదులు జియా-ఉల్-ఆవుద్దీన్ మరియు బలావుద్దీన్ పదే పదే వేధిస్తున్నారని ఆరోపించారు.