రాత్రియుగం నుంచి రాకెట్ యుగానికి వచ్చాం. కాలాలు.. పరిస్థితులు మారాయి. ఒకప్పుడు అజ్ఞానంతో దారుణాలకు ఒడిగట్టేవారు. ఇప్పుడు విజ్ఞానం పెరిగింది.. సంపద పెరిగింది. ఇలాంటి తరుణంలో క్రైమ్ రేట్ తగ్గాల్సింది పోయి.. క్రమక్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
అనుమానాలు, అదనపు కట్నాలు, అక్రమసంబంధాలు వివాహబంధంలో చిచ్చుపెడుతున్నాయి. భార్యలను అత్యంత దారుణంగా చంపేస్తున్నారు కొందరు భర్తలు. రెండ్రోజుల క్రితం గ్రేటర్ నోయిడాలో అదనపు కట్నం కోసం వేధించి భార్యకు నిప్పు పెట్టి చంపేశాడు. మేడిపల్లిలో భార్యపై అనుమానంతో ముక్కలుగా నరికి ప్రాణం తీశాడు భర్త. తాజాగా మరో ఘోరం చోటుచేసుకుంది. వరంగల్ లోని హంటర్ రోడ్డులో భార్య గౌతమిని(21) హత్య చేశాడు భర్త గణేష్( 22). మొహంపై దిండుపెట్టి నొక్కి హత్యకు పాల్పడ్డాడు. Also Read:Love: పెళ్లైన…
గల్ఫ్ దేశంలో మరో విషాదం చోటుచేసుకుంది. మరో భారతీయ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కేరళకు చెందిన అత్యుల్య శేఖర్ శనివారం తెల్లవారుజామున యూఏఈలోని షార్జా అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది.
వరకట్నం తీసుకోవడం నేరం.. అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా మార్పు మాత్రం రావడం లేదు. అక్కడితో ఆగుతున్నారా అంటే.. అదీ లేదు. పెళ్లైన కొన్ని రోజులకే అదనపు కట్నం కోసం భార్యలను వేధిస్తూ మానసిక వేదనకు గురిచేస్తున్నారు కొందరు భర్తలు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెళ్లైన కొన్ని రోజులకే అదనపు కట్నం కోసం వేధిస్తూ తనను ఇంట్లో నుంచి గెంటి వేశాడని ఓ భార్య ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త…
ఇటీవలి కాలంలో పెళ్లి అంటేనే భయపడిపోతున్నారు. గొడవల కారణంగా విడాకులు తీసుకోవడం, అక్రమ సంబంధాలు, ప్రియుడు లేదా ప్రియురాలితో పారిపోవడం వల్ల పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోంది. ఇదీకాకుండా నాగరిక సమాజంలో వరకట్న వేధింపులు నవ వధువుల మృతికి కారణమవుతున్నాయి. ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అగుడు పెట్టిన కొత్త కోడళ్లను అదనపు కట్నం కోసం వేధిస్తూ ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా మీరట్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెళ్లైన మూడు నెలలకే కట్నం కావాలంటూ వివాహితను భర్త,…
Triple Talaq: వరకట్న వేధింపులు ఎదుర్కొంటున్న ఒక మహిళ తనువు చాలించింది. పెళ్లయినప్పటి నుంచి అత్తమామలు కట్నం కోసం వేధించడంతో పాటు భర్త ఇటీవల ఫోన్‌లో ‘‘ట్రిపుల్ తలాక్’’ చెప్పడంతో సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. భర్త ట్రిపుల్ తలాక్ ఇవ్వడంతో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.
పెళ్లి ప్రతిఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. కానీ, కొందరి జీవితాల్లో మాత్రం పీడకలగా మారిపోతోంది. పెళ్లైన కొంతకాలానికే మనస్పర్థలు, గొడవల కారణంగా విడిపోవడం, ప్రాణాలు తీసుకోవడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి విషాద ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. ఓ నవవధువు పెళ్లై నెల రోజులు తిరగకముందే ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతురు అత్తారింట్లో భర్త, పిల్లాపాపలతో సంతోషంగా జీవించాలని ఆశపడిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన హాజీపూర్ మండలం…
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ఒక మహిళ తన భర్త, అత్తమామలు రూ. 2 లక్షల కట్నం ఇవ్వాలంటూ తనను లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది.
విశాఖపట్నంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెళ్లి చేశారు.. కానీ, అదనపు కట్నం కోసం వేధింపులు ఆగలేదు.. చివరకు అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ప్రాణాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. అత్తింటివారి అదనపుకట్నం కోసం వేధించారు.. అంతేకాదు తమ కూతురిని హత్య చేశారని తల్లి తరపువాళ్లు ఆరోపిస్తు్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని స్థానిక కోర్టు వరకట్న హత్య కేసులో మరణించిన మహిళ భర్త, అత్తమామలకు జీవిత ఖైదు విధించింది. దోషిగా తేలిన భర్త దర్శన్ సింగ్ (29), అతని తల్లి కమలేష్ దేవి (63)లకు ఒక్కొక్కరికి రూ.15,000 జరిమానా విధిస్తూ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అభయ్ శ్రీవాస్తవ తీర్పు చెప్పారు.