Maulana Mahmood Madani: జమియత్ ఉలేమా-ఎ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ మదాని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్, జ్ఞాన్‌వాపి-కాశీ వంటి కేసులతో సుప్రీం, హైకోర్టులపై ప్రభుత్వాలు ఒత్తిడిని పెంచుతున్నాయని ఆరోపించారు
Triple Talaq: వరకట్న వేధింపులు ఎదుర్కొంటున్న ఒక మహిళ తనువు చాలించింది. పెళ్లయినప్పటి నుంచి అత్తమామలు కట్నం కోసం వేధించడంతో పాటు భర్త ఇటీవల ఫోన్‌లో ‘‘ట్రిపుల్ తలాక్’’ చెప్పడంతో సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. భర్త ట్రిపుల్ తలాక్ ఇవ్వడంతో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.
Shabbir Ali : వక్ఫ్ బోర్డు, మతపరమైన సంస్థల నిర్వహణ, సామాజిక న్యాయంతో సంబంధం ఉన్న అంశాలపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నుంచి తమ పిటిషన్లపై లభించిన సానుకూల తీర్పును స్వాగతించారు. ఈ తీర్పు తమకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా, ప్రజల్లో న్యాయం పట్ల నమ్మకాన్ని పెంచిందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తమ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పును ప్రశంసించారు. “జడ్జిలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. కోర్టు…
అన్ని రంగాలలో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సమాజంలో మహిళల స్థితిగతులు మారాలని.. ధైర్యంగా సవాళ్లను ఎదురుకొని మహిళలు ముందుకు అడుగులు వేయాలని సూచించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆది నుంచి మహిళలను గౌరవించే సంప్రదాయం మనదని.. మహిళల అభివృద్ధికి, రక్షణకు మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. భూగర్భం ఖనిజాల వెలికితీత నుంచి వినీలాకాశంలో ఫైలట్ వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అన్ని…
గత ఆరేళ్లలో ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు దాఖలు చేసిన కేసుల వివరాలను సుప్రీంకోర్టు బుధవారం (జనవరి 29) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 2019లో ఆమోదించిన ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టాన్ని ఉల్లంఘించి, ట్రిపుల్ తలాక్ చెప్పి ఎంత మంది ముస్లిం పురుషులు తమ భార్యలకు విడాకులు ఇచ్చారో స్పష్టత ఇవ్వాలని కోరింది.
Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పట్టణంలో ఇటీవల పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుంది. సంభాల్‌లోని షాహీ జామా మసీదు సర్వేకి వచ్చిన అధికారులపై వేల సంఖ్యలో గుంపు రాళ్లదాడి చేసింది, కొందరు గన్ ఫైర్ చేశారు. స్థానికంగా ఉన్న ఇళ్లను ధ్వంసం చేసి, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలోని థానేలో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగు చూసింది. తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి రూ.4 లక్షల కోసం వేధించినందుకు ఓ వ్యక్తితో పాటు అతని కుటుంబానికి చెందిన మరో నలుగురిపై థానే పోలీసులు కేసు నమోదు చేశారు.
ట్రిపుల్ తలాక్ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. షరియత్ కౌన్సిల్ ప్రైవేట్ సంస్థ అని, కోర్టు కాదని న్యాయమూర్తి అన్నారు. ప్రస్తుతం విచారించిన కేసు 2010లో వివాహం చేసుకున్న ముస్లిం డాక్టర్ దంపతులది. భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నాడని.. అయితే మూడో తలాక్ పై భర్త ఎప్పుడూ ప్రస్తావించలేదని భార్య ఆరోపించింది.
Triple Talaq: రాజస్థాన్‌కి చెందిన వ్యక్తి పాకిస్తాన్ మహిళను పెళ్లి చేసుకునేందుకు భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పాడు. కువైట్‌లో నుంచి అతను భార్యకు ఫోన్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పినందుకు 35 ఏళ్ల వ్యక్తిని జైపూర్ విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.