Four Boys Attacked A Woman For Asking Cool Drinks Money: ఈరోజుల్లో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. యాటిట్యూడ్ పేరుతో నిబ్బా వేషాలు వేయడమే కాదు, దాడులకు కూడా పాల్పడుతున్నారు. తామేదో గొప్పవాళ్లమని, తాము చేసిందే కరెక్ట్ అని భావించి.. ఎదుటివారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు నలుగురు పోకిరీలు సైతం అలాగే హద్దుమీరి ప్రవర్తించారు. ఒక షాప్‌లో కూల్‌డ్రింక్ తీసుకుని తాగిన ఆ దుండగులు.. వాటికి డబ్బులు ఇవ్వకపోగా, తమకే డబ్బులు అడుగుతావా? అంటూ షాప్ యజమానురాలిపై దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Monsoon Tips: వర్షాకాలంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు తడిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. ?
రాకీ ఫిలిప్స్, మహ్మద్‌మాజ్ ఖాన్, మహ్మద్ అర్బాజ్, మహ్మద్ తైమూర్ అనే నలుగురు యువకులు జులై 17వ తేదీన రాత్రి సమయంలో పార్టీ చేసుకున్నారు. ఫుల్లుగా మందు తాగి ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఎస్ఆర్ నగర్ పరిధిలోని బాపునగర్‌లో ఒక కిరాణా దుకాణానికి వెళ్లారు. అక్కడ కూల్‌డ్రింక్స్ తీసుకుని తాగారు. అనంతరం డబ్బులు ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోసాగారు. అప్పుడు షాప్ యజమానురాలు వారిని కూల్‌డ్రింక్ డబ్బులు అడిగింది. ‘మేమెవరో తెలుసా? మమ్మల్నే డబ్బులు అడుగుతావా?’ అంటూ ఆమెతో దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ‘ఎవరైతే నాకేంటి? కూల్‌డ్రింక్ డబ్బులు ఇవ్వండి’ ఆమె అడగ్గా.. ఆ పోకిరీలు రెచ్చిపోయారు. ఆమెని తీవ్రంగా కొట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Fraud: కొందరు తమ భాగస్వాములను ఎందుకు మోసం చేస్తారో తెలుసా..!
పాపం ఆ బాధితురాలు.. తన తప్పేమీ లేకపోయినా, పోకిరీల చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. ఆ దెబ్బలతోనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ నలుగురు నిందితుల వివరాలు సేకరించి, వారిని వెంటనే పట్టుకున్నారు. ఆపై కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి మొట్టికాయలు వేస్తూ.. 18 రోజుల పాటు జైలుశిక్ష విధించింది.