2024 ఎన్నికల్లో ఒకరకమైన ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నాయకులు. గెలుపు కోసం ఐదేళ్ళు ఎదురు చూసిన కొందరు పొత్తు ధర్మంలో భాగంగా అప్పటిదాకా తాము వర్కౌట్ చేసుకున్న సీట్లను జనసేనకు వదులుకోవాల్సి వచ్చింది. సర్దుకుపోవాల్సిందేనని పార్టీ పెద్దలు తెగేసి చెప్పడంతో టిడిపి సీనియర్లు సైతం నోరుమెదపలేకపోయారు అప్పట్లో. అంత వరకు ఓకే అనుకున్నా... ఆ తర్వాతే అసలు టెన్షన్ మొదలైందట. నాడు సీట్లు త్యాగాలు చేసిన వారికి తగిన గుర్తింపు…
Kolleru: కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంపై మరోసారి తనిఖీ జరపాలని “కేంద్ర సాధికార కమిటీ”కి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే, కొల్లేరులో ప్రైవేటు భూములను నోటిఫై చేయడంపై సుప్రీంకోర్టును ప్రైవేటు మత్స్యకారులు సంఘం ఆశ్రయించిన విషయం విధితమే.
అగ్ర రాజ్యం అమెరికా రెండవ మహిళ ఉషా వాన్స్ భారత్‌కు చేరుకున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్యగా ఉషా ఢిల్లీలో అడుగుపెట్టారు. ఉషా చిలుకూరి పూర్వీకుల స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నకిలీ నోట్ల ముఠాలు రెచ్చిపోతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని దొంగ నోట్లను మార్పిడి చేయడమే పనిగా పెట్టుకున్నాయి. నకిలీ నోట్లు ప్రింట్ చేసేందుకు అవసరమైన సామాగ్రిని చైనా నుంచి దిగుమతి చేసుకొని మరి చెలరేగిపోతున్నాయి.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్లను అంతు చిక్కని వ్యాధి పట్టి పీడిస్తోంది. రోజు వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఆరోగ్యంగా కనిపించే కోడి గంటల వ్యవధిలో మృత్యువాత పడుతోంది.. డిసెంబర్ లో మొదలైన వైరస్.. జనవరి 13తర్వాత విజృంభించింది. H15N వైరస్ లక్షణాలతో రోజూ వేల సంఖ్యలో చనిపోతున్నాయి. వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
పందాల పండుగకు రంగం సిద్దమవుతుంది. నెలల తరబడి చంటిబిడ్డల్లా సాకిన పందెం పుంజులను బరిలో దించేందుకు ముహూర్తం దగ్గర పడటంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి అతిధులు ఇప్పటికే గ్రామాలకు చేరుకుంటున్నారు.. వీరితో పాటు పందాలపై మోజున్న జూదగాళ్ళంతా గోదావరి బాట పట్టారు. పెద్ద మొత్తంలో పందేలు కాసేందుకు సై అంటే సై అంటున్నారు.. ఇదే సమయంలో కూటమి నేతల మద్య పందాల నిర్వాహణ పోటి పెంచుతోంది.…
సంచలనం సృష్టించిన డెడ్‌బాడీ హోమ్ డెలివరీ కేసులో ట్విస్టులమీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమగోదావరిజిల్లా యండగండిలో ఈనెల 19వ తేదీన సాగి తులసి అనే మహిళ ఇంటికి చేరిన పార్సిల్ డెడ్‌బాడీ కేసులో పోలిసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుధీర్ వర్మను అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ వచ్చిచేరినట్టు అయ్యింది.. ఎందుకంటే.. ఇప్పుడు ప్రధాన నిందితుడిగా ఉన్న సుధీర్ వర్మ రెండో…
పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేసి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ రెస్టారంట్’ను నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు రూపాయలకే చికెన్ బిర్యానీ అని ప్రకటించడంతో జనం పోటెత్తారు. దాదాపు 2 వేల మంది బిర్యానీ కోసం ఎగబడ్డారు. కానీ, నిర్వాహకులు మాత్రం ఆఫర్ కింద కేవలం 200 బిర్యానీ ప్యాకెట్లను మాత్రమే విక్రయించారు.