Delhi: కొత్త ఫోన్ కొన్నందుకు ట్రీట్ ఇవ్వలేదని స్నేహితుడు హత్య
- దేశ రాజధాని ఢిల్లీలో దారుణం
- కొత్త ఫోన్ కొన్నందుకు ట్రీట్ అడిగిన స్నేహితులు
- ఇవ్వలేదని కత్తితో పొడిచి చంపిన ఫ్రెండ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త ఫోన్ కొనుక్కోవడమే ఆ బాలుడికి శాపమైంది. కొత్త మొబైల్ కొన్న ఆనందం ఎంతో సేపు లేకుండానే ఆవిరైపోయింది. స్నేహితుల దుర్బుద్ధి కారణంగా ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఓ తల్లికి కడుపుకోత మిగిల్చారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని షకర్‌పూర్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: RK Roja: అవన్నీ వెంటనే డిలీట్ చేయండి.. ఆర్కే రోజా హెచ్చరిక
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
సచిన్ అనే 16 ఏళ్ల బాలుడు ఢిల్లీలోని సకర్‌పూర్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం స్నేహితుడితో కలిసి మొబైల్ షాపుకి వెళ్లాడు. కోరుకున్న కొత్త మొబైల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ ఆనందంతో తిరిగి ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యలో ముగ్గురు స్నేహితులు తారసపడ్డారు. కొత్త ఫోన్ కొన్నందుకు పార్టీ ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. ఇది కాస్త ఘర్షణకు దారి తీసింది. స్నేహితుల్లో ఒకడు కత్తి తీసుకుని సచిన్‌ను పొడిచాడు. బలంగా పొడవంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాధితుడను ఆస్పత్రికి తరలించారు. అయితే సచిన్ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.
ఇది కూడా చదవండి: UP News: వీడు కొడుకేనా..? తల్లిపై అత్యాచారం, భార్యగా ఉండాలంటూ బలవంతం.. జీవిత ఖైదు విధించిన కోర్టు..
ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం షకర్‌పూర్‌లో పోలీసులు ఒక వీధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అక్కడ రక్తపు మరకలు కనిపించాయి. దీంతో స్థానికులను వాకబు చేయగా.. స్నేహితుల మధ్య గొడవ జరిగి.. ఒకరిని కత్తితో పొడిచారని చెప్పారు. బాధితుడను ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చేర్చినట్లుగా సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి ఆరా తీశారు. అప్పటికే బాలుడు మరణించాడు. వెనుక భాగంలో రెండు కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: UP: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో.. యూపీ సీఎం యోగి కీలక నిర్ణయం
కొత్త ఫోన్ కొన్నందుకు స్నేహితులు ట్రీట్ అడిగారని.. ఈ విషయంలో ఘర్షణ జరిగి హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే సంఘటనాస్థలిలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ముగ్గురు కూడా 16 ఏళ్ల వయసు వారేనని గుర్తించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Karnataka: రెండు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ తప్పనిసరి.. “ముస్లిం బుజ్జగింపు” అని బీజేపీ ఫైర్..
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!