Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- లక్నోలో తల్లిని చంపిన 17 ఏళ్ల మైనర్ యువకుడు..
- లింగమార్పిడి వద్దు అన్నందుకు తల్లిని హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. 17 ఏళ్ల మైనర్ తన తల్లిని కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. లింగ మార్పిడి శస్త్రచికిత్స చేసుకోవాలని 17 ఏళ్ల యువకుడు తల్లిని కోరడం, అందుకు తల్లి అభ్యంతరం తెలపడంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. పుట్టుకతో మగవాడైన యువకుడు గురువారం తల్లిని హత్య చేశాడు. హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు అతడి డైరీలో గుర్తించారు. అందులో ఎలా చంపాలనే దాని గురించి ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు.
శస్త్రచికిత్స విషయంలో తల్లి అభ్యంతరం చెప్పడంతో పాటు మెడికల్, కౌన్సిలింగ్ సహాయం తీసుకోవాలని సూచించడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైనట్లు అధికారుతు తెలిపారు. ఆ సమయంలో మైనర్ యువకుడు తన వెంట తెచ్చుకున్న ఇనుప రెంచ్‌తో తల్లి తలపై పలుమార్లు దాడి చేశాడు. దీంతో మహిళ అక్కడికక్కడే మరణించింది.
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
హత్య తర్వాత సదరు యువకుడే పోలీసులకు ఫోన్ చేసి చెప్పినట్లు అధికారులు తెలిపారు. నాకా హిందోలా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. హత్యకు ఉపయోగించిన రెంచ్ స్వాధీనం చేసుకుని మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్య తర్వాత తాను మైనర్ కావడంతో ఎలాంటి శిక్షలు పడుతాయి, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? శిక్షలకు సంబంధించిన వివరాలను చాట్‌జీపీటీ ద్వారా తెలుసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!