LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Subsidy: దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు, ముఖ్యంగా గృహిణులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వంటింట్లో పొగ సెగలు తగ్గించి, ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా అమలవుతున్న ప్రతిష్టాత్మక ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ (PMUY) పథకంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిలిండర్‌పై అందిస్తున్న రూ.300 రాయితీని (సబ్సిడీ) 2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, ఈ పథకం పరిధిని మరింత విస్తరిస్తూ కొత్తగా మరో 25 లక్షల మంది నిరుపేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణంగా ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్, ఇతర ఛార్జీల రూపంలో వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది.
అయితే ఉజ్వల పథకం కింద అర్హులైన పేద మహిళలకు ఉచిత గ్యాస్ స్టవ్, మొదటి సిలిండర్‌ను కేంద్రమే ఫ్రీగా అందిస్తుంది. ఆ తర్వాత చేయించే ప్రతి రీఫిల్లింగ్‌పై లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా రూ.300 సబ్సిడీని జమ చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 42 కోట్ల రీఫిల్స్‌కు ఈ రాయితీ సొమ్మును అందించిన కేంద్రం, రాబోయే ఏడాదిలోనూ ఈ ప్రయోజనాన్ని యథాతథంగా కొనసాగించనుంది. కేవలం పెద్ద సిలిండర్లకే కాకుండా, చిన్న కుటుంబాల కోసం ఇచ్చే 5 కిలోల సిలిండర్లపై కూడా దామాషా పద్ధతిలో ఈ సబ్సిడీ వర్తిస్తుండటం గమనార్హం. 2016 మే 1న ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ప్రధాని నరేంద్ర మోడీ స్టార్ట్ చేసిన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10.57 కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు అందాయి. తాజాగా మరో 25 లక్షల కొత్త కనెక్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఇంకా గ్యాస్ పొందని అర్హులైన మహిళలకు సువర్ణావకాశం దక్కనుంది.
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
కొత్త కనెక్షన్లకు అర్హతలు ఇవే..
*అర్హతలు: దరఖాస్తుదారు మహిళ అయి ఉండాలి. వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి.
* కావాల్సిన పత్రాలు: ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, రేషన్ కార్డు కాపీ.
* దరఖాస్తు విధానం: అర్హులైన మహిళలు ఉజ్వల యోజన అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో తమకు నచ్చిన గ్యాస్ కంపెనీని (ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ) ఎంచుకుని అప్లై చేసుకోవచ్చు. లేదా నేరుగా స్థానిక ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీని సంప్రదించి అవసరమైన పత్రాలు అందజేసి ఉచిత కనెక్షన్ పొందవచ్చు.
వంటింటి బడ్జెట్ భారం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, సిలిండర్ రీఫిల్లింగ్‌పై రూ.300 సబ్సిడీ కొనసాగించడం గ్రామీణ, పేద కుటుంబాలకు ఆర్థికంగా కొండంత భరోసానివ్వనుంది.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!