Delhi Murder: దేశ రాజధానిలో ఘోరం వెలుగుచూసింది. ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 17లో ఓ వ్యక్తి తన అత్తను, భార్యను కత్తెరతో హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. కుమార్తె పుట్టినరోజున వచ్చిన బహుమతి విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో నిందితుడు తన భార్య, అత్తగారిని కత్తెరతో హత్య చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తెరలను స్వాధీనం చేసుకున్నట్లు…
భార్యలు, భర్తలను చంపడం, పిల్లలు తల్లిదండ్రులను చంపడం చూస్తుంటే మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో ఘటనలో తనను ప్రేమించినప్రియుడు మరొకరితో పెళ్లికి సిద్ధమవడంతో ఆ యువతి ప్రశ్నించింది. ఇద్దరి మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. చివరకు ప్రియుడు ప్రేమించిన యువతిని ఐదవ అంతస్తు నుంచి తోసేసి అంతమొందించాడు. ఈ ఘటన ఢిల్లీలోని అశోక్ నగర్‌లో చోటుచేసుకుంది. ఈ కేసులో 26 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు.…
Nose pin: భార్యని చంపి, మురికి కాలువలో మృతదేహాన్ని పడేసిన కేసులో భర్త నిందితుడిగా తేలాడు. దాదాపు నెల రోజుల క్రితం ఢిల్లీలోని ఒక మురికి కాలువలో ఒక మహిళ మృతదేహం లభించింది. అయితే, ఈ కేసును పరిష్కరించడానికి పోలీసులకు మహిళ ‘‘ముక్కుపుడక’’ సాయం చేసింది. దీని ఆధారంగా దర్యాప్తు చేయగా భర్త అనిల్ కుమార్‌ని నిందితుడిగా గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కొత్త ఫోన్ కొనుక్కోవడమే ఆ బాలుడికి శాపమైంది. కొత్త మొబైల్ కొన్న ఆనందం ఎంతో సేపు లేకుండానే ఆవిరైపోయింది. స్నేహితుల దుర్బుద్ధి కారణంగా ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఓ తల్లికి కడుపుకోత మిగిల్చారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని షకర్‌పూర్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
రెస్టారెంట్‌లో కడుపారా తిని ఆస్వాదిద్దామనుకుని వెళ్తే ఏకంగా ప్రాణాలే పోయాయి. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 3:30 గంటలకు జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కత్తితో బెదిరించి 14 ఏళ్ల బాలుడిపై అతడి స్నేహితులు అసహజ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మరువకముందే.. మరో ఘటన చోటుచేసుకుంది. అసహజ శృంగారానికి బలవంతం చేసిన 20 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో జనవరి 17న జరగ్గా.. 19న విషయం వెలుగులోకి వచ్చింది. తలపై బండ రాయితో కొట్టడంతో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. నిందితుడు బిహార్‌కు చెందిన…