Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thackeray Brothers: కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని, ఆయన పూర్తిగా అధికార భారతీయ జనతా పార్టీ చేతిలో ఒక ‘ఆయుధం’గా మారిపోయారంటూ శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అత్యంత ఘాటు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయంటూ విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ అంశంపై ముంబయి నగరంలో ప్రతిపక్ష నేతలు భారీ ఎత్తున కదం తొక్కారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలను నిరసిస్తూ ‘విరాట్ గర్జన మోర్చా’ పేరిట ముంబయిలో విపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. మెట్రో సినిమా వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్ర బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రధాన కార్యాలయం వరకు హోరెత్తింది. ఈ ఆందోళనలో ఉద్ధవ్ ఠాక్రేతో పాటు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే, కాంగ్రెస్ సీనియర్ నేతలు బాలాసాహెబ్ థోరట్, విజయ్ వాడెట్టివార్, ఎన్సీపీ (ఎస్పీ) నాయకులు జయంత్ పాటిల్, శశికాంత్ శిందే, జితేంద్ర అవాద్, అనిల్ దేశ్ముఖ్ తదితర అగ్ర నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి కేంద్రంపై ధ్వజమెత్తారు.
ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “ఓటరు జాబితా నుంచి అక్రమ బంగ్లాదేశీయుల పేర్లను తొలగించడానికే ఈ ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను చేపట్టామని పాలకులు చెబుతున్నారు. అదే నిజమైతే.. దేశంలో అసలు ఎంతమంది బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారో కేంద్ర ప్రభుత్వం ఎందుకు అధికారికంగా వెల్లడించడం లేదు? ఆ లెక్కలేమైనా కేంద్రం వద్ద ఉన్నాయా?” అని నిలదీశారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను ఒక అస్త్రంలా వాడుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో వెంటనే ఎస్ఐఆర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితాల సవరణ పేరుతో అసలైన స్థానిక ఓట్లను గల్లంతు చేసే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం బతకాలంటే భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికలనూ బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇదే సభలో కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో జరుగుతున్న అవకతవకలపై గత కొంతకాలంగా రాహుల్ గాంధీ ఆధారాలతో సహా పోరాడుతున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ గోల్మాల్ వ్యవహారాలకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు సాక్షాత్తూ ఎన్నికల సంఘం నుంచే వెలుగుచూస్తున్నాయని విమర్శించారు. సార్వత్రిక, స్థానిక ఎన్నికల వేళ ఓటర్ల జాబితాపై మహారాష్ట్ర విపక్షాలు ఏకమై పోరాటానికి దిగడం జాతీయ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
Also Read
- CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
- Coimbatore Blasts: 19 పేలుళ్లు, 58 మంది మృతి.. కోయంబత్తూర్ పేలుళ్ల నిందితులకు విజయ్ సర్కార్ పెరోల్.
- CJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లకు బిగ్ రిలీఫ్..!
- BJP: తిరుగుబాటు కోసమే వియత్నాంకు రాహుల్ గాంధీ.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ.!
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!