Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Crime: బెజవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించడంతో పాటు ప్రియురాలు కూడా తనను దూరం పెట్టడంతో ఆగ్రహానికి గురైన ఓ యువకుడు కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో ప్రియురాలు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన చిన్నా, ఓ యువతి కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిన్నాతో ఆ యువతికి వివాహం చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించినట్లు సమాచారం. మరోవైపు సదరు యువతి కూడా చిన్నాను దూరం పెట్టడంతో అతడు కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో శుక్రవారం ప్రియురాలి ఇంటికి వెళ్లిన చిన్నా.. తన వెంట తీసుకెళ్లిన కత్తితో ఆమెపై దాడి చేశాడు.. ఈ దాడిలో యువతి గొంతుకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక, యువతిపై దాడి చేసిన అనంతరం భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో ఉన్న చిన్నాను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.. ఈ ఘటనతో విజయవాడలో తీవ్ర కలకలం రేగింది. మృతుడిని చిన్నాగా గుర్తించారు.. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Also Read
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!