RK Roja Warns Youtube Channel Owners running on Her name: ఒకప్పటి సినీ హీరోయిన్, ప్రస్తుత వైసీపీ ఫైర్ బ్రాండ్ లేడీ లీడర్ ఆర్కే రోజా తన ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు, వెంటనే, నా పేరు పై ఉన్న సదరు ఛానల్స్, అకౌంట్ లను డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నాను లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంటూ ఆమె సుదీర్ఘ హెచ్చరిక మెసేజ్ పోస్ట్ చేశారు.
“అందరికీ నమస్కారం!! నా మిత్రులు మరియు అభిమానులు పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు. నేను సామాజిక మాద్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి #facebook #Instagram , #twitter మరియు #threads మాత్రమే వాడుతున్నాను, నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు దయచేసి గమనించగలరు. నా పై ఉద్దేశ్య పూర్వకంగా జరిగిన, జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటి. వెంటనే సదరు ఛానల్స్ నా పేరు పై ఉన్న అకౌంట్లను డెలీట్ చెయ్యాలని హెచ్చరిస్తున్నాను లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నా అధికారికంగా వెరిఫైడ్ అకౌంట్(బ్లూటిక్ ఉన్న)లను మాత్రమే ఫాలో కాగలరని అభిమానులను కోరుకుంటున్నాను” అని ఆమె పేర్కొన్నారు. ఇక నగరి నుంచి గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె మంత్రిగా కూడా పని చేశారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఆమె వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అందరికీ నమస్కారం!!
నా మిత్రులు మరియు అభిమానులు పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు.నేను సామాజిక మాద్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి #facebook #Instagram , #twitter మరియు #threads మాత్రమే వాడుతున్నాను,
నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు దయచేసి గమనించగలరు. నా పై…
— Roja Selvamani (@RojaSelvamaniRK) September 24, 2024