మొదట్లో అన్ని ఫ్రీ అంటూ కస్టమర్లను ఆకట్టుకున్న డిజిటల్ పేమెంట్స్ వేదికలు.. ఆ తర్వాత క్రమంగా చార్జీలు వడ్డిస్తున్నాయి.. డిజిటల్ చెల్లింపుల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఫోన్‌పే కూడా ఇదే బాట పట్టింది.. రూ. 50కి మించిన మొబైల్ రీఛార్జీలపై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయునన్నట్లు పేర్కొంది. వాల్‌మార్ట్ గ్రూప్‌నకు చెందిన ఈ డిజిటల్ చెల్లింపుల సంస్థ రూ.50 కంటే అధిక విలువ కలిగిన మొబైల్ రీఛార్జీలపై లావాదేవీకి రూ.1 నుంచి రూ.2 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేసేందుకు రెడీ అయ్యింది.
Read Also: యూపీలో కాంగ్రెస్ కొత్త ప్లాన్.. శ్రీకారం చుట్టనున్న ప్రియాంక..
రీఛార్జి లావాదేవీ యూపీఐ ద్వారా చేసినా, ప్రాసెసింగ్ రుసుము భారం పడనుంది.. అయితే, యూపీఐ ఆధారిత లావాదేవీలపై ఛార్జీలు విధించడం ఇదే మొదటిసారి. అయితే, రూ.50 లోపు ఫోన్ రీఛార్జీలపై ఎలాంటి రుసుము ఉండదని.. రూ.50-100 రీఛార్జీలపై రూ.1, రూ.100 దాటితే రూ.2ను వసూలు చేస్తామని చెబుతున్నారు ఫోన్‌పే ప్రతినిధులు. ఇక, ఇది ప్రయోగాత్మకంగా చేస్తున్నాం.. కేవలం ఎంపిక చేసిన కొంత మంది వినియోగదారులపైనే వసూలు చేస్తామని పేర్కొన్నారు.