Zombie Virus: ఇటీవల శాస్త్రవేత్తలు ఆర్కిటిక్ ప్రాంతంలో గడ్డకట్టిన స్థితిలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ‘‘ జాంబీ వైరస్’’ను గుర్తించారు. దాదాపుగా 48,500 ఏళ్లుగా ఆర్కిటిక్ ప్రాంతంలో ఇది గడ్డకట్టిన స్థితిలో ఉంది. ఆర్కిటిక్, ఇతర ప్రదేశాల్లో చాలా ఏళ్లుగా పలు వైరస్ లు మంచులో నిద్రాణస్థితిలో ఉన్నాయి. అయితే వీటి వల్ల కలిగే ప్రమాదాల గురించి శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా హెచ్చరిస్తున్నారు. ప్రమాదకర వైరస్ మానవుల్లో ప్రాణాంతకవ్యాధిని కలిగించే సామర్థ్యాన్ని కలిగించే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ వల్ల ధృవాల వద్ద ఉన్న మంచు క్రమంగా కరుగుతోంది. దీంతో ఈ వైరస్ ల ముప్పు మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ లపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా జాంబీ వైరస్ వల్ల వచ్చే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ఫ్రెంచ్ శాస్త్రవేత్త, ఆర్కిటిక్ లో సేకరించిన వైరస్ లను మళ్లీ పునరుద్ధరించాడు. ఆర్కిటిక్ టండ్రా, అలస్కా, కెనడా, రష్యాలోని సైబిరియా ప్రాంతాలు అనేక పురాతన వైరస్ కు మంచులో గడ్డకట్టిన స్థితిలో కలిగి ఉన్నాయి.
Read Also: Mamatha Mohan Das: ఎన్టీఆర్ హీరోయిన్ ను అవమానించిన నయన్.. మరీ ఇంతలానా
ఇలాంటి బ్యాక్టీరియా, వైరస్ లను పునరుజ్జీవింపచేయడం ద్వారా మానవాళికి ఎంత ముప్పును కలిగిస్తాయో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న యాంటీబయాటిక్స్ వల్ల బ్యాక్టీరియాను కొంతలో కొంత అరికట్టవచ్చు. అయితే వైరస్ ఇందుకు భిన్నంగా ఉంటుంది. సరైన వ్యాక్సిన్ లేకపోతే వైరస్ మానవాళిపై విధ్వంసం సృష్టిస్తుంది. ఇందుకు ఉదాహరణ కరోనా వైరస్. గతంలో సైబీరియాలో మంచు కరగడం వల్ల రెయిన్ డీర్ లలో ఆంత్రాక్స్ వ్యాప్తి కారణం అయిన విషయాన్ని పరిశోధకులు గుర్తు చేశారు.
తాజా అధ్యయనంలో ఫ్రెంచ్ పరిశోధకుడు జీన్ మిచెల్ క్లావేరీ జాంబీ వైరస్ ను మేల్కొలిపాడు. ఈ అధ్యయనం ద్వారా 48 వేల ఏళ్లు నిద్రాణస్థితిలో ఉండీ, అతిపెద్ద డీఎన్ఏ కలిగిన వైరస్ అకాంతమీబాకు ఇన్ఫెక్షన్ కలిగిస్తుందా..? లేదా..? అనేదాన్ని తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ బృందం ఏక కణం కలిగిన అమీబాను ఈ పురాతన వైరస్ ప్రభావితం చేస్తుందా అనే పరిశోధనపై దృష్టిపెట్టారు. రాబోయే కాలంలో మానవులు, ఇతర జంతువులపై ఈ వైరస్ లు ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకునేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది.