రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును చాలా కాలం పాటు స్థిరంగా ఉంచినప్పటికీ… ప్రభుత్వ రంగ బ్యాంకులు డిపాజిటర్లకు శుభవార్త చెప్పాయి. ఇప్పటికే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని చాలాసార్లు పెంచాయి. మరోసారి గరిష్ట వడ్డీ రేటును 7.40 శాతానికి పెంచాయి. ప్రధాన బ్యాంకులలో.. బ్యాంక్ ఆఫ్ బరోడా 399 రోజుల డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీని అందిస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 666 రోజుల డిపాజిట్లపై 7.30 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 777 రోజుల డిపాజిట్లపై 7.25 శాతం, కెనరా బ్యాంక్ 444 రోజుల డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీని ఇవ్వనుంది. సెంట్రల్ బ్యాంక్ 444 రోజుల డిపాజిట్లపై 7.30 శాతం, ఇండియన్ బ్యాంక్ 444 రోజుల డిపాజిట్లపై 7.25 -7.25 శాతం వడ్డీని, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 444 రోజుల డిపాజిట్లపై 7.25 -7.25 శాతం వడ్డీని ఇస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ 333 రోజుల డిపాజిట్లపై అత్యధికంగా 7.40 శాతం వడ్డీని ఇవ్వనుంది. కొత్త రేట్లు ఆగస్టు 12 నుంచి అమలులోకి రానున్నాయి.
READ MORE: Donald Trump: డొనాల్డ్ ట్రంప్కు తృటిలో తప్పిన ప్రమాదం..
నిజానికి డిపాజిట్ల కంటే బ్యాంకుల రుణాల రేట్లు పెరుగుతున్నాయి. దీంతో బ్యాంకులు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల రుణాల వృద్ధి రేటు 16 శాతం కాగా, డిపాజిట్ల వృద్ధి రేటు 10 శాతంగా ఉంది. గురువారం ఆర్‌బీఐ కూడా డిపాజిట్ సమస్యను పరిష్కరించాలని బ్యాంకులకు సూచించింది. కెనరా బ్యాంక్ రుణాలు 0.05 శాతం పెరిగాయి. దీని కారణంగా గృహ రుణం, వినియోగదారుల రుణం సహా అన్ని రకాల రుణాలపై అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.