YVS Chowdary : ఎన్టీఆర్‌కి జోడీగా వీణారావు హీరోయిన్‌గా ఫిక్స్ అయింది. అయితే ఈ ఎన్టీఆర్ మన యంగ్ టైగర్ కాదు. ఆయన మరో ఎన్టీఆర్. నందమూరి కుటుంబంలో నాలుగో తరం నటుడు. నందమూరి జానకిరామ్ తనయుడు ఎన్టీఆర్ ను హీరోగా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు అమ్మాయిని కథానాయికగా పరిచయం చేస్తానని వైవీఎస్ చౌదరి ఇదివరకే చెప్పారు. ఇప్పుడు వీణారావును కథానాయికగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్‌ను మాటల రచయితగా ఎంచుకున్నారు.
Read Also:Delhi Rain: ఢిల్లీలో భారీ వర్షం.. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు..!
వైవీఎస్ చౌదరిపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రభావం చాలా ఉంటుంది. ఆయన రాఘవేంద్రరావు శిష్యుడు కావడంతో కథానాయికలను బాగా, చాలా అందంగా చూపిస్తారు. వైవీఎస్ చౌదరి పరిచయం చేసిన హీరోయిన్లు తెలుగు సినిమాపై తమదైన ముద్ర వేశారు. అందులో ఇలియానా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.. రామ్ సరసన దేవదాస్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఇలియానా ఆ తర్వాత టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా మారింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోని స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఇప్పుడు వీణారావు కూడా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకోబోతున్నారని వైవీఎస్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఈ అమ్మాయికి క్లాసికల్ డ్యాన్స్ కూడా బాగా తెలుసు. మరి కొన్ని రోజులు ఆగితే వైవీఎస్ చౌదరి ఈ అమ్మాయిని తెరపై ఎంత అందంగా చూపిస్తాడో కనిపిస్తుంది. చక్కటి కథ, మంచి సంగీతం, సాహిత్యం, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో తెరకెక్కిన చిత్రమిది అని వైవీఎస్ అన్నారు. త్వరలో ఎన్టీఆర్, వీణారావులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి అభిమానులకు పరిచయం చేయనున్నారు.
Read Also:Rammohan Naidu: చంద్రబాబు ఆలోచనతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్..