సిల్వర్ ధరలు మళ్లీ విశ్వరూపం సృష్టిస్తున్నాయి. గతేడాది సునామీ సృష్టించిన ధరలు.. ఈ ఏడాది కూడా అదే జోరు కనిపిస్తోంది. తాజాగా వెనిజులా సంక్షోభంతో బంగారం, వెండి ధరలు మరింత పెరగొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కిలో వెండి రూ.3 లక్షల చేరువలో ఉండగా.. అంతకు మించే ఉండొచ్చని తెలుస్తోంది. నిన్న కిలో వెండిపై రూ.6,000 పెరగగా.. ఈరోజు కూడా రూ. 5,000 పెరిగింది. దీంతో రికార్డ్ స్థాయిలో సిల్వర్ మెరుపులు సృష్టిస్తోంది.
ఇది కూడా చదవండి: Iran: ఖమేనీ జాడ మిస్సింగ్.. ఎక్కడున్నట్టు? ఆ వార్తలు నిజమేనా?
దీంతో ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,53, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,71,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,53, 000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Trump: వెనిజులా భవిష్యత్ ప్రణాళిక వెల్లడించిన ట్రంప్.. ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు
ఇక ఈరోజు తులం గోల్డ్‌పై రూ.600 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,820 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.550 పెరగగా రూ.1,27,250 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.450 పెరగగా రూ.1,04,120 దగ్గర ట్రేడ్ అవుతోంది.