వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్నాక అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటనలు చేశారు. చమురు, ఎన్నికలు, ఇన్‌ఛార్జ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వెనిజులా భవిష్యత్ ప్రణాళికను ట్రంప్ వెల్లడించారు.
ఎన్‌బీసీ న్యూస్‌తో ట్రంప్ మాట్లాడుతూ.. వెనిజులాకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించగా.. ఒకే మాటలో ‘నేనే’ అన్నారు. ఇక వెనిజులాపై అమెరికా యుద్ధం చేయడం లేదని తెలిపారు. అలాగే సమీప భవిష్యత్‌లో ఎన్నికలు కూడా నిర్వహించబోమని తేల్చిచెప్పారు. దక్షిణ అమెరికా దేశాన్ని చక్కదిద్దడమే కర్తవ్యం అన్నారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాలను పునర్నిర్మించాలని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Venezuela: నికోలస్ మదురో.. డెల్సీ రోడ్రిగ్జ్ ఇద్దరూ సాయిబాబా భక్తులే.. ఫొటోలు వైరల్
మొట్టమొదటిగా వెనిజులాను ఆరోగ్యంగా మార్చాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం 18 నెలల కన్నా తక్కువ సమయం పట్టవచ్చని వెల్లడించారు. ఈ క్రమంలో అమెరికా సబ్బిడీ ఇవ్వొచ్చని తెలిపారు. చమురు కంపెనీలు ఖర్చులను భరించి పెట్టుబడులు తిరిగి పొందుతాయని చెప్పారు. ‘‘చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చమురు కంపెనీలు దానిని ఖర్చు చేస్తాయి.’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇక వెనిజులాతో యుద్ధం ఉండదని.. కేవలం మాదక ద్రవ్యాలు అమ్మే వ్యక్తులతోనే ఉంటుందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Nicolas Maduro: నేను చాలా మంచివాడిని.. అన్యాయంగా కిడ్నాప్ చేశారు.. కోర్టులో మదురో వాదన
వెనిజులా పతనానికి బాధ్యత వారి నాయకత్వానిదేనన్నారు. అది నేరాలను, అస్థిరతను ఎగుమతి చేస్తోందని ఆరోపించారు. ఇక తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన డెల్సీ రోడ్రిగ్జ్‌తో అమెరికా సంబంధాలు కొనసాగిస్తుందా? అన్న దానిపై కూడా వివరణ ఇచ్చారు. ఆమెతో ఎటువంటి కమ్యూనికేషన్ లేదని తేల్చిచెప్పారు. డెల్సీ రోడ్రిగ్జ్‌పై కూడా ఆంక్షలు కొనసాగుతాయా? లేదా? అనేది త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు. అప్పటి వరకు వెనిజులాకు ఇన్‌ఛార్జ్‌గా ‘‘నేనే’’ ఉంటానని ట్రంప్ తేల్చి చెప్పారు.
విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వెనిజులా నాయకత్వంతో టచ్‌లో ఉన్నారని.. రోడ్రిగ్జ్‌తో స్పానిష్‌లో మార్కో రూబియో అనర్గళంగా మాట్లాడతారన్నారు. సహకారం విచ్ఛిన్నమైతే మాత్రం అమెరికా రెండవ సైనిక దాడికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఇక ఈ ఆపరేషన్ కోసం తాను కాంగ్రెస్ ఆమోదం పొందడంలో విఫలమయ్యాననే విమర్శలను ట్రంప్ తోసిపుచ్చారు. చట్టసభ సభ్యులకు అమెరికా చర్యల గురించి తెలుసునని.. కాంగ్రెస్‌లో మాకు మంచి మద్దతు ఉందన్నారు. ఎవరికి ఎప్పుడు, ఎప్పుడు ఏమి తెలుసు అనే దాని గురించి వివరించడానికి నిరాకరించారు.
ఇదిలా ఉంటే వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలకే వెనెజులా అధ్యక్ష భవనం సమీపంలో కాల్పుల శబ్దాలు మోగాయి. సెంట్రల్ కారకాస్‌లోని మిరాఫ్లోర్స్ ప్యాలెస్‌పై గుర్తు తెలియని డ్రోన్‌లు ఎగిరాయి. అయితే ఈ డ్రోన్ల దాడులతో తమకు సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది.
BREAKING:
Caracas right now
— Visegrád 24 (@visegrad24) January 6, 2026