గతేడాది మెరుపులు, విశ్వరూపం సృష్టించిన బంగారం, వెండి ధరలు.. కొత్త ఏడాదిలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నాయి. నూతన సంవత్సరంలోనూ మగువలకు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈరోజు గోల్డ్, సిల్వర్ ధరలు భారీ పెరిగాయి. తులం గోల్డ్ ధరపై రూ.1,140 పెరగగా.. కిలో వెండిపై రూ.4,000 పెరిగింది. దీంతో గోల్డ్ లవర్స్ బెంబేలెత్తిపోతున్నారు.
ఇది కూడా చదవండి: MP: లేబర్‌తో భార్య ఎఫైర్.. ఉపాధ్యాయుడైన భర్తను ఏం చేసిందంటే..!
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,140 పెరగగా.. రూ.1,36,200 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,050 పెరగగా రూ.1,24,850 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.860 పెరగగా రూ.1,02,150 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Switzerland bar fire: అంతులేని విషాదం.. 47 మంది సజీవదహనం.. 115 మందికి గాయాలు
ఇక వెండి ధర కూడా షాకిచ్చింది. ఈరోజు కిలో వెండిపై రూ.4,000 తగ్గింది. దీంతో ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,42, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,60,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,42, 000 దగ్గర అమ్ముడవుతోంది.