పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ.. మరోసారి బంగారం ధరలు కాస్త కిందికి దిగాయి.. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.47,000కి దిగిరాగా.. 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి రూ.270 తగ్గడంతో రూ.51,270కి పరిమితమైంది.. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలో ఈ రోజు బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే.. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి.. రూ. 47,000కి చేరింది.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గడంతో రూ. 51,270కి పతనమైంది.. ఇక, హైదరాబాద్‌లో బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,000గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.51,270 పతనమైంది.. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,000కి పరమితం కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,270కి తగ్గింది.. విశాఖపట్నంలో బంగారం ధర రూ.250 తగ్గి 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,000కి, రూ.270 తగ్గడంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,270కి దిగివచ్చింది..
Read Also: Teachers: స్కూళ్లలో నేటి నుంచి కొత్త విధానం.. లేట్ అయితే అంతే..!
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,270గా ఉంటే.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.47,540 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,860గా ఉంది.. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,270కి పరిమితం అయ్యింది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,270కి పడిపోయింది. సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.60,000గా కొనసాగుతుంది. విజయవాడ, విశాఖ, చెన్నై, కేరళ నగరాల్లో కూడా ఇదే ధర పలుకుతోంది. ఇదే వెండి బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతాలో రూ.50,800 పలుకుతోంది.