సర్కారీ బడుల రూపరేఖల్ని మార్చేస్తున్న జగన్ సర్కార్… విద్యార్థులకు మెరుగైన విద్య అందేందుకు చర్యలు చేపడుతోంది. టీచర్లు రోజూ స్కూల్‌కు రావడమే కాదు… సమయపాలన పాటించేలా చేస్తోంది. దీనికోసం నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌ను ఉపయోగించబోతోంది. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తోంది ఏపీ సర్కార్. ఇప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కూడా నడుం కట్టింది. టీచర్లకు ప్రత్యేకంగా తయారు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌ను ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
Read Also: TTD Hundi Collection New Record: రికార్డు సృష్టించిన శ్రీవారి హుండీ..
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ళు, విద్యాశాఖలోని బోధన, బోధనేతర సిబ్బంది కొత్త అటెండెన్స్ విధానం అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు థంబ్ ఇంప్రెషన్ ద్వారా వీరందరి బయో మెట్రిక్ అటెండెన్స్ నమోదయ్యేది. ఇకపై మరింత మెరుగైన, భద్రమైన ఫేషియల్ రికగ్నీషన్ అటెండెన్స్ నమోదవుతుంది. విద్యార్థులకు మంచి చదువు అందాలంటే మాత్రం అది ఉపాధ్యాయులపైనే ఆధారపడుతుంది. కానీ… సర్కారీ బడుల్లో టీచర్లు వేళకు రావడం లేదని, వచ్చినా పూర్తి సమయం ఉండడం లేదా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో టీచర్లు స్కూళ్లకు నిర్ణీత సమయానికి వస్తున్నారా? లేదా? ఎంత సమయం స్కూల్లో ఉంటున్నారు వంటి అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి కొత్త మొబైల్ యాప్ ఉపయోగపడుతుంది. పాఠశాల విద్యాశాఖ ఆధీనంలో పనిచేస్తున్న భోధనేతర సిబ్బంది కూడా ఈ యాప్ ద్వారానే హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే, ఇవాళ్టీ నుంచి యాప్ ద్వారానే అటెండెన్స్ వేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా.. అటెండెన్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకునే ప్రసక్తే లేదంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. యాప్ ఆధారిత హాజరుపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రేపటి నుంచి మొత్తం యాప్‌లను డౌన్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.. మరోవైపు, వైద్యారోగ్య శాఖ సిబ్బందికి ప్రభుత్వమే పరికరాలు కొనుగోలు చేసిచ్చినట్లుగా విద్యాశాఖకు ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.. ఇక, ఈ పరిస్థితుల నేపథ్యంలో.. ఉపాధ్యాయ సంఘాలతో ఈ రోజు సాయంత్రం చర్చలు జరపున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.