మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు సంబంధించిన మరో వార్త ఇప్పుడు సంచలనంగా మారింది… ఈ నెల మొదటి వారంలో తన 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన బిల్ గేట్స్.. తన భార్య మెలిండాకు విడాకులు ఇవ్వగా.. ఇప్పుడు.. తాను స్థాపించిన మైక్రోసాఫ్ట్ సంస్థను వీడాల్సిన పరిస్థితి వచ్చింది.. దీనికి కారణం… ఆ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగితో ఉన్న వివాహేతర సంబంధం వల్లే బిల్ గేట్స్.. బోర్డు నుంచి వైదొలిగాల్సి వచ్చిందంటూ.. వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. తన జీవితం ఇక పూర్తిగా సామాజిక సేవకే వినియోగించాలనుకుంటున్నానని, అందువల్లే మైక్రోసాఫ్ట్ బోర్డుకు రాజీనామా చేస్తున్నట్లు బిల్‌గేట్స్ గతేడాది ప్రకటించి.. అప్పటి నుంచి గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలతో బిజీగా మారిపోయారు బిల్ గేట్స్.. కానీ, తాజా వ్యవహారాలు సంచలనంగా మారిపోయాయి.
అయితే, బిల్ గేట్స్.. ఆ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగి మధ్య ఉన్న సంబంధంపై మైక్రోసాఫ్ట్ బోర్డు విచారణకు ఆదేశించింది.. దీంతో.. విచారణకు సహకరించేందుకు వీలుగా బిల్‌గేట్స్.. మైక్రోసాఫ్ట్‌కు రాజీనామా చేసినట్టుగా చెబుతున్నారు.. ఇక, ప్రపంచ కుభేరుల్లో నాల్గో బిలియనీరుగా ఉన్న బిల్ గేట్స్.. 2000 నుంచి కంపెనీకి చెందిన ఒక మహిళా ఉద్యోగితో ఎఫైర్ పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతూ వచ్చింది.. ఈ కారణంతోనే 2020 లో కంపెనీ బోర్డు సభ్యుల ఒత్తిడితో ఆయన మైక్రోసాఫ్ట్ తో విడిపోయినట్లు కూడా సమాచారం.. మరోవైపు.. ఈ నెలలోనే 27 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించిన గేట్స్.. ఇప్పుడు అనూహ్యంగా.. రాజీనామా చేయాల్సి రావడం చర్చగా మారింది. ది వాల్ స్ట్రీట్ జర్నల్‌లో వచ్చిన తాజా కథనం ప్రకారం.. బిల్ గేట్స్‌తో చాలా సంవత్సరాలుగా తనకు ఉన్న లైంగిక సంబంధాన్ని తెలియజేస్తూ కంపెనీకి చెందిన ఒక మహిళా ఇంజినీర్.. సంస్థలోని ఉన్నతాధికారులకు లేఖ రాశారట.. దీనిపై బోర్డు సభ్యులు 2019 లో లా సంస్థతో ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో బిల్ గేట్స్… బోర్డు సమావేశాలకు హాజరుకావడం సరైంది కాదని భావించి.. సంస్థకు రాజీనామా చేసినట్టుగా పేర్కొంది.