ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలోని మెడికల్ కాలేజీ చైల్డ్‌వార్డ్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 16 మంది మృత్యువుతో పోరాడుతున్నారు. కాగా.. ఈ ఘటనపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏడు రోజుల్లోగా తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.
మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ స్కూల్ బోర్డు పరీక్షలో తమ స్కూలు టాపర్‌ల పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ముస్లింలు కాని కొంతమంది గర్ల్స్ స్కార్ప్స్ కట్టుకుని కనిపించారు. దీంతో పాఠశాలలో బాలికలందరినీ హిజాబ్ ధరించమని స్కూల్ యాజమాన్యం బలవంతం చేశారని ఆరోపించారు.
Chikoti praveen: ఇప్పట్లో క్యాసినో నిర్వహించే ఆలోచన లేదని, ఈడీ విచారణకు ఎప్పుడూ పిలిచినా వస్తానని వెళ్తానని చీకోటి ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. నిన్న ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్ కుమార్ ను ఏడు గంటల పాటు విచారించారు.
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం పెద్ద రచ్చగా మారింది.. తన పర్యటనలో దాదాపు 20 నిమిషాలపు పాటు చిక్కుకుపోయిన ప్రధాని మోడీ.. ఆకస్మాత్తుగా తన పర్యటన రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీ చేరుకున్నారు.. అయితే, దీనిపై తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శల పర్వం కొనసాగుతుండగా.. ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.. మోడీ పర్యటనలో భద్రతా పరమైన అంశాలపై అటు కేంద్రంలోనూ, ఇటూ రాష్ట్రంలోనూ ఓ కమిటీ విచారిస్తున్న విషయం తెలిసిందే కాగా.. వచ్చే సోమవారం…
తెలంగాణలో ఓ కాలేజీ ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది.. సూర్యాపేట మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిని ర్యాగింగ్ చేశారు సీనియర్ విద్యార్ధులు… శనివారం అర్ధరాత్రి సమయంలో కొందరు సీనియర్లు.. బాధిత విద్యార్థి ఒంటిపై ఉన్న దుస్తులను బలవంతంగా తొలగించి ఫొటోలు తీశారు.. జుట్టు కూడా కత్తిరించినట్టు తెలుస్తోంది.. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధిత విద్యార్తి.. హైదరాబాద్‌లోని తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలిపాడు.. దీంతో, వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు డయల్ 100కు…
సూర్యుడు, భూమి మద్య కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది. ఇంత దూరం ఉన్నప్పటికీ సూర్యుడి నుంచి వెలువడే కాంతి, వేడి భూమిని చేరుతుంటాయి. సమ్మర్ వచ్చింది అంటే వేడిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటాం. అంతటి వేడున్న సూర్యుని వద్దకు చేరుకోవాలంటే అయ్యేపనేనా… అంటే కాదని చెప్తాం. అసాధ్యాన్ని నాసా సుసాధ్యం చేసి చూపించింది. కొన్ని నెలల క్రితం నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహం ఏప్రిల్ 28 వతేదీన సోలార్ కరోనాలోకి…
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు సంబంధించిన మరో వార్త ఇప్పుడు సంచలనంగా మారింది… ఈ నెల మొదటి వారంలో తన 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన బిల్ గేట్స్.. తన భార్య మెలిండాకు విడాకులు ఇవ్వగా.. ఇప్పుడు.. తాను స్థాపించిన మైక్రోసాఫ్ట్ సంస్థను వీడాల్సిన పరిస్థితి వచ్చింది.. దీనికి కారణం… ఆ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగితో ఉన్న వివాహేతర సంబంధం వల్లే బిల్ గేట్స్.. బోర్డు నుంచి వైదొలిగాల్సి వచ్చిందంటూ.. వాల్‌స్ట్రీట్…