Adani-Hindenburg case: గతేడాది అదానీ-హిండెన్‌బర్గ్ కేసు ఎన్నో సంచలనాలకు కారణమైంది. అదానీ గ్రూప్ ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేక ఆరోపణలు చేసింది. అయితే ఈ కేసును విచారించాలని సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. గత ఏడాది నవంబర్‌లో ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
అదానీ గ్రూపుపై అనేక ఆరోపణలు చేయడంతో పిటిషనర్లు నిజానిజాలు తేల్చాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)ని మార్చిలో విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని కూడా కోర్టు ఏర్పాటు చేసింది.
Read Also: Israel-Hamas War: భార్య ఉండటం వల్లే తనపై అత్యాచారం చేయలేదు.. బందీగా బయటపడిన యువతి
అయితే విచారణ సందర్భంగా అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై దర్యాప్తు పూర్తిచేయడంలో జాప్యంపై సెబీకి వ్యతిరేకంగా పిటిషన్లు కూడా దాఖలు చేయబడ్డాయి. సుప్రీం ఆదేశాలు పాటించకుండా నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయనుందుకు సెబీపై కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాలని పిటిషన్లు అభ్యర్థించారు. అయితే సెబీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక రంగంలో సంచలనంగా మారిని అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో బుధవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.