Adani-Hindenburg case: గతేడాది అదానీ-హిండెన్‌బర్గ్ కేసు ఎన్నో సంచలనాలకు కారణమైంది. అదానీ గ్రూప్ ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేక ఆరోపణలు చేసింది. అయితే ఈ కేసును విచారించాలని సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుపై రేపు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్ప వెలువరించనుంది. గత ఏడాది నవంబర్‌లో ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.