Israel-Hamas War: అక్టోబర్ 7 నాడు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో 1200 మందిని చంపడమే కాకుండా.. 240 మందిని కిడ్నాప్ చేసి గాజాకు తీసుకెళ్లారు. అయితే ఇటీవల ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో కొన్ని రోజుల పాటు ఇజ్రాయిల్, హమాస్ మధ్య సంధి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో కొంతమంది బందీలను హమాస్ విడిచిపెట్టగా.. అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ తన జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో 54 రోజుల పాటు హమాస్ చెరలో ఉండీ విడుదలైన 21 ఏళ్ల ఇజ్రాయిల్-ఫ్రెంచ్ టాటూ ఆర్టిస్ మియా స్కెమ్ తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని ఛానెల్ 13కి చెప్పింది. ప్రతీ రోజూ తనపై అత్యాచారం జరుగుతుందని భయపడినట్లు ఆమె తెలిపింది. అయితే తనపై హమాస్ మిలిటెంట్ రేప్ చేయకపోవడానికి ఒకే కారణం ఉందని, అతని భార్య, పిల్లలు ఇంట్లో ఉండటం వల్ల అత్యాచారం చేయడం కుదరలేదని చెప్పింది. తాను, అతను ఒకే గదిలో ఉండటాన్ని అతని భార్య అసహ్యించుకునేదని మియా చెప్పింది.
Read Also: Truckers Strike: ప్రజల్లో “పెట్రోల్” భయాలు.. పలు ప్రాంతాల్లో అమ్మకాలపై పరిమితి..
నిరంతరం తనపై నిఘా ఉండేదని, ఏ క్షణంలో అయిన చంపేస్తారని భయపడ్డానని, ఆకలితో అలమటించానని తన అనుభవాలను తెలిపింది. చీకటి గదిలో ఉంచి, మాట్లాడటానికి అనుమతించలేదని చెప్పింది. హమాస్ ఉగ్రవాది తన కళ్లతోనే అత్యాచారం చేస్తున్నట్లు అనిపించేదని, ఒకానొక సమయంలో తన భార్య అంటే ఇష్టం లేదని, ఆమెను ప్రేమించడం లేదని అతను చెప్పినట్లు యువతి వెల్లడించింది. 24 గంటలు తననే చూస్తూ, కళ్లతో రేప్ చేసే వాడని, అత్యాచారం జరుగుతుందేమో అని, చనిపోతాననే భయం ఉండేదని, అయితే ఉగ్రవాది భార్య తనని శత్రువుగా చూస్తున్నప్పటికీ.. కొంత భరోసా ఇచ్చిందని మియా స్కెమ్ చెప్పింది. అక్టోబర్ 7న జరిగిన దాడిలో దక్షిణ ఇజ్రాయిల్ ప్రాంతంలో ఓ మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి మియాను హమాస్ మిలిటెంట్లు అపహరించారు.