Tata Altroz iCNG: ఇండియాలో సీఎన్‌జీ వాహనాల మోడల్స్ విడుదల అవుతున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకీ దీంట్లో ముందుంది. ఇప్పుడు దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టాటా లో టియాగో, టిగోర్ సీఎన్‌జీ వెర్షన్ కార్లు ఉండగా.. ప్రస్తుతం మరో హ్యచ్ బ్యాక్ కారు టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీని తీసుకువస్తోంది. దీనికి సంబంధించిన ధరలను కూడా వెల్లడించింది. భారతదేశంలో ట్విన్-సిలిండర్ CNG సిస్టమ్‌ను కలిగి ఉన్న మొదటి మోడల్ గా రికార్డులకెక్కింది.
టాటా ఆల్ట్రోజ్ iCNG ఫీచర్లు:
వాయిస్-ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, 8-స్పీకర్ హర్మాన్ ఆడియో సిస్టమ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ ఉన్నాయి.
Read Also: James Webb Telescope: ఇది స్టార్ కాదు “మాన్‌స్టర్”.. సూర్యుడి కన్నా 10,000 రెట్ల పెద్ద నక్షత్రం
టాటా ఆల్ట్రోజ్ iCNG 1.2-లీటర్ ఇంజన్‌తో వస్తుంది, ఇది 73.5bhp మరియు 103Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తోంది. ట్విన్ సిలిండర్ సీఎన్జీ సెటప్ తో వస్తుంది. దీంతో బూట్ స్పేస్ తగ్గే అవకాశం ళుంది. కారులో ఇంధనం నింపే సమయంలో కారును ఆపేసే విధంగా మైక్రో స్విచ్ ఇందులో ఉంది. థర్మల్ ఇన్‌సిడెంట్ ప్రొటెక్షన్ ఇంజన్‌కి CNG సరఫరాను నిలిపివేస్తుంది.
టాటా ఆల్ట్రోజ్ iCNG ధరల వివరాలు ఇవే(ఎక్స్-షోరూమ్)..
టాటా ఆల్ట్రోజ్ iCNG XE – రూ. 7.55 లక్షలు
టాటా ఆల్ట్రోజ్ iCNG XM+ – రూ. 8.40 లక్షలు
టాటా ఆల్ట్రోజ్ iCNG XM+ (S) – రూ. 8.85 లక్షలు
టాటా ఆల్ట్రోజ్ iCNG XZ – రూ. 9.53 లక్షలు
టాటా ఆల్ట్రోజ్ iCNG XZ+ (S) – రూ.10.03 లక్షలు
టాటా ఆల్ట్రోజ్ iCNG XZ+O (S) – రూ. 10.55 లక్షలు
మొత్తం నాలుగు రంగుల్లో ఈ కారు రాబోతోంది. ఒపెరా బ్లూ, డౌన్ టౌన్ రెడ్, ఆర్కెడ్ గ్రే, అవెన్యూ వైట్ కలర్లు అందుబాటులో ఉన్నాయి.