James Webb Telescope: ఈ విశాల విశ్వం మన ఊహకు కూడా అందదు. విశ్వంలోని గెలాక్సీలు, బ్లాక్ హోల్స్, నక్షత్రాలతో పోలిస్తే భూమి ఇసుక రేణువు కన్నా తక్కువే. అయితే ఎప్పటికప్పుడు విశ్వ రహస్యాలను తెలుసుకోవాలను మానవుడి ఆశ అనేక ప్రయోగాలకు కారణం అవుతోంది. మనం ఉన్న గెలాక్సీ ‘‘ మిల్కీ వే’’ గురించే మనం ఇప్పటి వరకు పూర్తిగా తెలుసుకోలేకపోయాం. అలాంటిది ఈ విశ్వంలో కొన్ని కోటాను కోట్ల గెలాక్సీలు, అందులో లక్షల కోట్ల సంఖ్యలో నక్షత్రాల ఇలా మన ఊహకు కూడా అందని విధంగా విశ్వం విస్తరించి ఉంది.
ఇదిలా ఉంటే విశ్వ రహస్యాలను చేధించేందు ఏడాది క్రితం నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు కలిసి ‘‘జెమ్స్ వెబ్ టెలిస్కోప్’’ని అంతరిక్షంలోకి పంపాయి. మునుపెన్నడూ చూడనటువంటి ఖగోళ అద్భుతాలను జెమ్స్ వెబ్ తన కెమెరాలతో బంధించింది. విశ్వం తొలినాళ్లలో ఏర్పడిన నక్షత్రాలు, గెలాక్సీలను కూడా ఇది చూడగలదు.
Read Also: Rahul Gandhi : లారీ ఎక్కిన రాహుల్ గాంధీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇదిలా ఉంటే తాజాగా ఈ టెలిస్కోప్ భారీ నక్షత్రాన్ని గుర్తించింది. ఎంతలా అంటే ఇది మన సూర్యుడితో పోలిస్తే 5000 నుంచి 10,000 రెట్లు పెద్దది. సూర్యుడితో పోలిస్తే 5 రెట్ల అధిక వేడి అంటే 75 మిలియన్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగి ఉన్న గ్రహాన్ని జెమ్స్ వెబ్ గుర్తించింది. ఇది స్టార్ కాదు ‘మాన్‌స్టర్’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు కనుగొన్న అతిపెద్ద నక్షత్రం సూర్యుడి కన్నా 300 రెట్లు పెద్దది. అయితే ఇప్పడు ఆ రికార్డును తిరగరాసింది కొత్తగా కనుగొన్న నక్షత్రం. బిగ్ బ్యాంగ్ తర్వాత కేవలం 440 మిలియన్ ఏళ్ల తర్వాత ఈ నక్షత్రం ఉద్భవించినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను యూరోపియన్ పరిశోధకుల బృందం మే 5న ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్‌లో ప్రచురించారు. గెలాక్సీ GN-z11లో ఈ నక్షత్రం ఉంది. ఇది భూమికి 13.3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
ప్రతీ గెలాక్సీలో గ్లోబులర్ క్లస్టర్స్ అని పిలువబడే నక్షత్రాల గుంపు ఉంటుంది. ఈ క్లస్టర్స్ లోని నక్షత్రాలు భారీ వైవిధ్యాన్ని చూపిస్తుంటాయి. మన మిల్సీవే గెలాక్సీలో కూడా ఇలాంటి క్లస్టర్లు కనిపిస్తాయి. ఈ ప్రాంతాలు విశ్వంలోని అతిపెద్ద నక్షత్రాలకు నిలయంగా ఉంటాయి. ఇవి విశ్వ ఆరంభానికి సమాధానాలు ఇవ్వగలవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇలాంటి నక్షత్రాలు గుర్తించడం చాలా అరదు ఎందకంటే ఇలాంటి నక్షత్రాలు తమలోని ఇంధనాన్ని త్వరగా మండిస్తాయి. దీంతో వీటి జీవితకాలం తక్కువగా.. కేవలం రెండు మిలియన్ సంవత్సరాలు మాత్రమే ఉంటాయి.