Car prices hike: కొత్త కార్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా.? అయితే మీ జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రముఖ కార్ కంపెనీలు తమ కార్ మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జనవరి నుంచి కార్ రేట్లు మరింత ప్రియం కానున్నాయి. మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా, ఎమ్‌జి మోటార్ ఇండియా వంటి కార్ మేకర్స్ వచ్చే నెల నుంచి తమ మోడళ్ల ధరలు పెంచనున్నాయి.
Read Also: Kerala Doctor Suicide: వరకట్న వివాదంతో వైద్యురాలు ఆత్మహత్య.. బాయ్‌ఫ్రెండ్ కారణమంటూ నోట్..
ద్రవ్యోల్భణం, పెరుగుతున్న వస్తువుల ధరలు కారణంగా కార్ల రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం కార్ మేకర్స్ మాత్రం ఏ మోడల్‌పై ఎంత ధర పెంచారనేది ప్రకటించలేదు. కార్ల తయారీదారులు తమ వాహనాల ధరలను ఏడాదికి రెండుసార్లు పెంచుతున్నాయి.
ఇప్పటికే మారుతి తన కార్ల ధరలను జనవరి 2024లో పెంచాలని యోచిస్తున్నట్లు తెలిపింది. జనవరి 16న భారత్‌లోకి హ్యుందాయ్ క్రేటాను విడుదల చేయాలని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ సీఓఓ తరుణ్ గార్గ్ ఈ విషయాన్ని వెల్లడించారు. పెరిగిన ఇన్‌పుట్ ఖర్చలు, ప్రతికూల మారకపు రేట్లు, వస్తువుల ధరలు పెరగడం వంటి ఇతరత్రా కారణాలు జనవరి నుంచి వాహనాల రేట్లను పెంచుతున్నాయి. మరోవైపు మహీంద్రా కూడా తన ఎస్‌యూవీ వాహణాలు, వాణిజ్య వాహనాలపై జనవరి నుంచి ధరల్ని పెంచనుంది. అయితే కంపెనీలు చెబుతున్న దాని ప్రకారం.. కార్ల ధరల్లో పెరుగుదల మోడళ్ల బట్టి మారుతుందని తెలుస్తోంది.