Kerala Doctor Suicide: కేరళలో ఓ యువ వైద్యురాలి మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 22 ఏళ్ల షహానా వరకట్న వివాదంతో ఆత్మహత్యకు పాల్పడింది. షహనా బాయ్‌ఫ్రెండ్ డాక్టర్ ఇఏ రువైస్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు భారీగా కట్నాన్ని డిమాండ్ చేశారు. ఏకంగా బీఎండబ్ల్యూ కారు, 150 తులాల బంగారం, 15 ఎకరాల భూమిని డిమాండ్ చేశాడు. రువైస్ వరకట్న దాహాన్ని తీర్చలేకపోవడంతో, షహానాతో వివాహం ఆగిపోయింది.
షహానా ఆత్మహత్య కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందించేలా చేసింది. ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణాజార్జ్‌తో పాటు కేరళ ఉమెన్ కమిషన్, మైనారిటీ కమిషన్ ఈ ఆత్మహత్యపై విచారణకు ఆదేశించాయి. తాజాగా షహనా సూసైడ్ నోట్ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ‘‘తన కుటుంబం ఒకటిన్నర కిలోల బంగారం, భూమి అడిగితే ఇవ్వలేనన్నది నిజం’’ అని సూసైడ్ నోట్‌లో రాసింది. దీనిని పోలీసులు ఆమె అపార్ట్మెంట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Big Breaking: ఎంపీ పదవికి రాజీనామా సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
నిందితుడు పెళ్లి చేసుకుంటాననే హమీ ఇవ్వడం, ఆ తర్వాత కట్నాన్ని డిమాండ్ చేయడం షహానాని ఆత్మహత్యకు ప్రేరేపించిందని, ప్రతీ ఒక్కరూ కూడా డబ్బుపైనే ఆశ పెంచుకున్నారని షహనా సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారని స్థానిక మీడియా తెలిపింది. బాయ్‌ఫ్రెండ్ రువైస్ కట్నం డిమాండ్ తనను ఆత్మహత్యకు ప్రేరేపించిందని ఆమె ఆరోపించారు.
రువైస్, షహానా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. అయితే రువైస్ మాత్రం ఆమెకు అండగా నిలబడలేదని షహనా సోదరుడు జాసిమ్ చెప్పారు. రువైస్ కూడా తన తల్లిదండ్రుల లాగే వరకట్నం కోసం డిమాండ్ చేశాడని ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్యకు ప్రేరేపించడం, వరకట్న నిషేధ చట్టం ప్రకారం అతనిపై కేసు నమోదు చేసి, 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.