Hyundai Venue July 2025 offer: జూలై నెలలో హ్యుందాయ్ కంపెనీ వివిధ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ కంపెనీకి చెందిన రెండవ బెస్ట్ సెల్లింగ్ కారు హ్యుందాయ్ వెన్యూపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తున్నారు. జూలై 2025లో హ్యుందాయ్ వెన్యూ కొనుగోలు చేస్తే.. ఏకంగా రూ. 85,000 వరకు ఆదా అవుతుంది. నగదు తగ్గింపుతో పాటు, ఈ ఆఫర్‌లో ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాల కోసం.. కస్టమర్లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. హ్యుందాయ్ వెన్యూ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
READ MORE: Siddaramaiah: నాయకత్వ మార్పు లేదని ఎన్ని సార్లు చెప్పాలి.. జర్నలిస్టులపై సిద్ధరామయ్య రుసరుసలు
హ్యుందాయ్ వెన్యూ ఫీచర్లు..
హ్యుందాయ్ వెన్యూలో 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్, ఆటో ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు, భద్రత కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అందించారు.
మూడు ఎంపికల్లో..
పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడుకుంటే.. హ్యుందాయ్ వెన్యూలో 3 ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. మొదటిది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 83bhp శక్తిని, 114Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. రెండవది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్.. ఇది గరిష్టంగా 120bhp శక్తి, 172Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మూడవది 1.5-లీటర్ డీజిల్ ఇంజన్.. ఇది గరిష్టంగా 100bhp శక్తి, 240Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారత మార్కెట్లో, హ్యుందాయ్ వెన్యూ టాప్ మోడల్ ధర(ఎక్స్- షోరూం) రూ.7.94 లక్షల నుంచి రూ.13.62 లక్షల వరకు ఉంటుంది. హ్యుందాయ్ వెన్యూ టాటా పంచ్, మారుతి సుజుకి బ్రెజ్జా, కియా సోనెట్, టాటా నెక్సాన్, మారుతి సుజుకి ఫ్రంట్క్స్ వంటి ఎస్‌యూవీలతో ఈ కారు పోటీ పడుతుంది.
READ MORE: Anil Kumble: నితీశ్ కుమార్ రెడ్డిపై అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు.. అలా మాత్రం చేయొద్దు..!
ఆఫర్ ఎలా వర్తిస్తుంది?
నగదు తగ్గింపు: అన్ని వెన్యూ, వెన్యూ ఎన్ లైన్ వేరియంట్‌లకు ₹40,000 నగదు తగ్గింపు వర్తిస్తుంది.
ఎక్స్ఛేంజ్ బోనస్: మీరు ఇప్పటికే ఉన్న వాహనాన్ని ఎక్స్ఛేంజ్ చేస్తే.. అదనంగా ₹40,000 తగ్గింపు పొందవచ్చు.
స్క్రాపేజ్ బోనస్: మీరు మీ వాహనాన్ని స్క్రాప్ చేసి ఆ సర్టిఫికేట్‌ను సమర్పిస్తే.. మరో ₹45,000 తగ్గింపు వర్తిస్తుంది.
గరిష్టంగా ₹85,000 (₹40,000 నగదు తగ్గింపు + ₹45,000 స్క్రాపేజ్ బోనస్) తగ్గింపు వర్తిస్తుంది.