Sudan Crisis: సైన్యం, పారామిలిటీరీ మధ్య ఘర్షణతో ఆఫ్రికా దేశం సూడాన్ అట్టుడుకుతోంది. ఈ రెండు దళాలకు చెందిన నేతల మధ్య విభేదాలు ఈ సంక్షోభానికి కారణం అయ్యాయి. ఆర్మీ చీఫ్ అబ్దేల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో మధ్య తీవ్ర విభేదాలు, ఈ రెండు భద్రతా బలగాల మధ్య సూడాన్ దేశం రావణకాష్టంగా మారింది. ముఖ్యంగా రాజధాని ఖార్టూమ్ నగరంలో రెండు దళాల పోరు తారాస్థాయికి చేరింది. దీంతో ఇప్పటివరకు ఆ దేశంలో 350 మందికి పైగా మరణించారు.
ఇదిలా ఉంటు ముస్లిం దేశం అయిన సుడాన్, రంజాన్ పండగ సందర్భంగా కాల్పుల 72 గంటల పాటు కాల్పుల విమరణ ప్రకటించినట్లు పారామిలిటరీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈద్ ఉత్-ఫితర్ సందర్భంగా పౌరులను ఖాళీ చేయించేందుకు హ్యుమానిటీ కారిడార్ తెరవడానికి, కుటుంబాలను కలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
Read Also: Somu Veerraju: బీజేపీతో టీడీపీ కలుస్తుందా? అచ్చెన్నాయుడు ఏం చెబుతారు..?
ప్రజాస్వామ్య పునరుద్ధణ కోసం పారామిలిటరీని, సైన్యంలో కలిపే ప్రతిపాదనపై ఈ ఇద్దరు నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో సూడాన్ లో మరోసారి ప్రజాస్వామ్యం వైపు వెళ్లాలనే ఆశలను దెబ్బతీసింది. ఇటీవల యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కాల్పుల విరమణకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ ఘర్షణను అణిచివేసేందుకు సైనిక పరిష్కారం తప్ప వేరే మార్గం లేదని ఆర్మీ చీఫ్ బుర్హాన్ అన్నారు.
ఈ ఘర్షణల కారణంగా సూడాన్ లోన ఖార్టూమ్ నగరంలో పాటు ఓమ్‌దుర్మాన్ మరియు బహ్రీలలో ప్రజలు పారిపోయేందుకు సిద్ధం అయ్యారు. వేలాది మంది సూటికేసులు పట్టుకుని బస్ స్టేషన్ల వద్దకు చేరుకున్నారు. ఇక నగరంలో ఆస్పత్రుల్లో మందులు లేవు, సూపర్ మార్కెట్లలో సరుకులు లేవు. చాలా మంది విదేశీయులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. దాదాపు 10,000 నుండి 20,000 మంది ప్రజలు చాద్‌లోని సరిహద్దులోని గ్రామాలలో ఆశ్రయం పొందారని యూఎన్ శరణార్థి సంస్థ UNHCR, ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) తెలిపింది. దేశంలో నాలుగింట ఒక వంతు ఆకలితో అలమటిస్తున్నట్లు వెల్లడించింది.