Viral Video: పింఛన్ కోసం వృద్ధురాలి పాట్లు.. ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా ఒంటి కాలితో నడక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
70-Year-Old Forced To Walk Barefoot To Collect Pension From Bank: వృద్ధులకు ప్రభుత్వం ఇచ్చే పింఛనే ఆసరా. ప్రభుత్వం ఇచ్చే రెండు మూడు వేలను నెలంతా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు. అదే సమయంలో పింఛన్ సరైన సమయంలో రాకుంటే వారి బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. చాలా కుటుంబాల్లో కన్నవాళ్లు వృద్ధులైన తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడంతో ఈ పింఛనే ఆధారంగా ఉంటోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పింఛన్ కోసం పడుతున్న పాట్లు పలువురితో కంటతడిపెట్టిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Also Read
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో తన వృద్ధాప్య పింఛను కోసం 70 ఏళ్ల వృద్ధురాలు చెప్పులు లేకుండా కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఘటన హృదయవిదారకంగా ఉంది. జిల్లాలోని ఝరిగావ్ బ్లాక్ బానూగూడ గ్రామానికి చెందిన సూర్య హరిజన్ అనే మహిళ విరిగిన కుర్చీని ఆసరాగా చేసుకుని ఎండవేడిలో చెప్పులు లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిరుపేదలకు సాయం చేయడానికి ప్రభుత్వ పథకాలు అమలులో ఉన్నప్పటికీ, సూర్య మహాజన్ కు వివిధ కారణాల వల్ల అందడం లేదు.
#WATCH | A senior citizen, Surya Harijan walks many kilometers barefoot with the support of a broken chair to reach a bank to collect her pension in Odisha's Jharigaon
SBI manager Jharigaon branch says, "Her fingers are broken, so she is facing trouble withdrawing money. We'll… pic.twitter.com/Hf9exSd0F0
— ANI (@ANI) April 20, 2023
సూర్య హరిజన్ పెద్ద కొడుకు వలసకూలీగా వేరే రాష్ట్రానికి వెళ్లగా.. మరో కొడుకు పశువులను మేపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. చిన్న గుడిసెలో కాలం వెళ్లదీస్తున్నారు. గతంలో వృద్ధురాలికి పింఛన్ డబ్బులు చేతికి అందేవి, కానీ ప్రస్తుతం ఆమె బ్యాంక్ ఖాతాలో పింఛన్ డబ్బులు పడుతున్నాయి. ఇదిలా ఉంటే ఆమె ఎడమ చేయి బొటన వేలిముద్ర కొన్ని సార్లు సరిపోవడం లేదు, దీంతో పింఛన్ డబ్బులు చెల్లించడం సమస్యగా మారుతోందని సదరు బ్యాంక్ చెబుతోంది. 4 నెలలుగా ఆమెకు పింఛన్ అందలేదని, దీంతో ఆమె బ్యాంకు వెళ్లాల్సి రావడంతో ఇలా కుర్చీనే చేతికర్రగా ఉపయోగించుకుని ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా ప్రయాణించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో అధికార యంత్రాంగం దిగివచ్చింది. ఆమెకు ఇంటికే పింఛన్ పంపిస్తామని, ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!