Israel: ఇజ్రాయిల్ మరోసారి గాజాపై విరుచుకుపడింది. గాజాలోని హమాస్ లక్ష్యంగా వైమానికి దాడులు నిర్వహించింది. ఇజ్రాయిల్ భూభాగంపైకి గాజా నుంచి డజన్ల కొద్దీ రాకెట్లు ప్రయోగించబడ్డాయి. గాజా స్ట్రిప్ లోని అనేక భాగాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. హమాస్ శిక్షణా కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరిగినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది. దక్షిణ ఇజ్రాయెల్ పైకి 35 రాకెట్లను గాజా నుంచి ప్రయోగించారు.
Read Also: USCIRF: భారత్‌లో మతస్వేచ్ఛ లేదు, ఆంక్షలు విధించాలి.. ఇండియా స్ట్రాంగ్ రిప్లై
హమాస్ సాయుధ విభాగం ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ఇజ్రాయిల్ పైకి క్షిపణులను ప్రయోగించింది. నిరాహార దీక్ష చేస్తూ పాలస్తీనా ఖైదీ ఇజ్రాయిల్ లో మరణించడం ఉద్రిక్తతలకు కారణం అయింది. హమాస్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా గాజాలోని మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. గాజాపై దాడులు చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ఇజ్రాయిల్ ఆర్మీ ప్రకటించింది. పాలస్తీనా ఖైదీ 45 ఏళ్ల ఖాదర్ అద్నాన్ మరణించిన తర్వాత ఈ రెండు ప్రాంతాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
పాలస్తీనా ప్రధాన మంత్రి మెహ్మద్ స్టాయే ఖాదర్ మరణానిన్ని ఉద్దేశపూర్వక హత్య అని ఇజ్రాయిల్ ను నిదించాడు. అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పటికీ, వైద్యం అందించకుండా జైలులోనే ఉంచి ఇజ్రాయిల్ చంపేసిందని ఆరోపించారు. ఇజ్రాయిలో 1967 సిక్స్ డే వార్ తర్వాత వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని ఇజ్రాయిల్ ఆక్రమించింది. ఈ ప్రాంతాలో ఉంటున్న పాలస్తీనియన్ల ఇబ్బందులకు గురి చేస్తోందని పాలస్తీనా ఆరోపిస్తోంది.