Imran Khan: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్.. రాజకీయంగా కూడా పతనావస్థలో ఉంది. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్, అక్కడి షహజాబ్ షరీఫ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. మరోవైపు సైన్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ రాజకీయ పరిస్థితులు తీవ్ర ఒత్తడిలో ఉన్నాయి. దీనికి తోడు ఒకసారి ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం జరగడం పాకిస్తాన్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుపుతోంది.
Read Also: USCIRF: భారత్‌లో మతస్వేచ్ఛ లేదు, ఆంక్షలు విధించాలి.. ఇండియా స్ట్రాంగ్ రిప్లై
ఇదిలా ఉంటే మరోసారి ఇమ్రాన్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై మూడోసారి హత్యాయత్నం జరిగినట్లు లాహోర్ హైకోర్టులో తెలియజేశారు. తనపై ఉన్న అన్ని రాజకీయ కేసులను రద్దు చేయాలని కోరుతున్నారని, రెగ్యులర్ కోర్టుకు హాజరుకావడం తన ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని కోర్టుకు తెలిపారు. దేశద్రోహం, దైవదూషణ, హింస మరియు ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం వంటి వివిధ ఆరోపణలపై దేశంలోని వివిధ నగరాల్లో తనపై నమోదైన మొత్తం 121 కేసులను రద్దు చేయాలని కోర్టును కోరారు.
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చైర్మన్, మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ కోర్టులో మాట్లాడుతూ.. కోర్టుకు రెగ్యులర్ గా హాజరుకావడం వల్ల నా ప్రాణాలకు ప్రమాదం ఉందని, నేను ఇప్పటికే రెండు హత్యాయత్నాల నుంచి బయటపడ్డాలని, పంజాబ్ లోని వజీరాబాద్ లో, ఇస్లామాబాద్ లోని జ్యుడిషియన్ కాంప్లెక్ వద్ద, తనపై హత్య యత్నం జరిగిందని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్న వారు తనను చంపాలని అనుకుంటున్నారని, తనపై మూడోసారి హత్యాయత్నం జరగబోతోందని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్ లో పంజాబ్ లోని వజీరాబాద్ ప్రాంతంలో ఇమ్రాన్ ఖాన్ పై తుపాకీతో దాడి జరిగింది. అతని కాలికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఈ దాడికి ప్రధాని షహబాజ్ షరీఫ్ తో పాటు హోంమంత్రి రాణా సనావుల్లా, ఐఎస్ఐ అధికారి మేజర్ జనలర్ ఫైసల్ నసీర్ కారణం అని ఆరోపించాడు.