Maharashtra Political Crisis: మహరాష్ట్ర రాజకీయ సంక్షోభం, ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సీఎం ఏక్ నాథ్ షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి నిరాకరించింది. షిండే వర్గానికి చెందిన భరత్ గోగావాలేను శివసేన విప్‌గా నియమిస్తూ హౌస్ స్పీకర్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని సుప్రీం పేర్కొంది.
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే శివసేన, బీజేపీ ప్రభుత్వానికి విషమ పరీక్ష ఎదురుకాబోతోంది. పార్టీ ఫిరాయించిన శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్దవ్ ఠాక్రే వర్గం వేసిన పిటిషన్ పై రేపు అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వబోతోంది. గతేడాది శివసేన తిరుగుబాటుపై ఉద్దవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2022 జూన్ నెలలో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసినందుకు ఏక్ నాథ్ షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీనిపై సుప్రీంకోర్టు రేపు…
HD Kumaraswamy: కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలు విడుదలయ్యే తేదీ మే 13పై ఉంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ విజయాలు ఎలా ఉండబోతున్నాయనే విషయం ఆ రోజే తేలనుంది. ఇదిలా ఉంటే ప్రతీ పార్టీ నాయకుడు కూడా తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జేడీయూ పార్టీ నేత హెచ్డీ కుమారస్వామి మాట్లాడుతూ.. ఈ సారి కింగ్ మేకర్ కాదు కింగ్ కాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ చెబుతున్న దానికన్నా మెరుగైన స్థానాలను సాధించనున్నట్లు వెల్లడించారు.
7000-Year-Old Road: ఎన్నో వేల ఏళ్ల నాటి సంస్కృతులు ఈ మహాసముద్రాల కింద నిక్షిప్తం అయి ఉన్నాయి. దీనికి సజీవ సాక్ష్యమే తాజా మధ్యదరా సముద్రం కింద కనుగొనబడిన ఓ రహదారి. పురావస్తు పరిశోధకులు పరిశోధనలు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పదులు కాదు, వందలు కాదు ఏకంగా 7000 ఏళ్ల క్రితం నాటి రోడ్డును పరిశోధకులు కనుగొన్నారు. మధ్యదరా సముద్రం దిగువన సముద్రపు మట్టి నిక్షేపాల కింద ఈ రహదారిని బయటపడింది.
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో ఆ దేశం రణరంగంగా మారింది. ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు కరాచీ, పెషావర్, లాహోర్, క్వెట్టా ఇలా అన్ని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ఆందోళనలు మిన్నంటాయి.
karnataka Exit Poll: 2024 లోక్ సభ ఎన్నికల ముందు కీలకంగా భావిస్తున్న కర్ణాటక అసెంబ్లీ పోలింగ్ ముగిసింది. ఈ రోజు 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.
BREAKING NEWS: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు తెలిసింది. జూన్ 22న ప్రధాని అమెరికా పర్యటకు వెళ్తారని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చే విందులో పాల్గొంటారని వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోడీ పర్యటన అమెరికా, భారతదేశం మధ్య స్నేహబంధం మరింత పెరుగుతుందని, భారతీయులు, అమెరికన్ల స్నేహాన్ని ధృవీకరిస్తుందని వైట్ హౌజ్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Elon Musk: ప్రపంచవ్యాప్తంగా 2.24 బిలియన్ల యూజర్లతో వాట్సాప్ అత్యధికంగా ఉపయోగించే మొబైల్ యాప్స్ లో ఒకటిగా ఉంది. అయితే దీనిపై ట్విట్టర్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాప్ యాక్టివ్ గా లేనప్పుడు కూడా వాట్సాప్ లోని మైక్రోఫోన్ యాక్సెస్ లోనే ఉంటుందని ఓ ఇంజనీర్ ట్విట్టర్ వేదిగా చేసిన ఆరోపణలపై ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఇక 80 ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు కావాల్సి ఉంటుంది.
Imran Khan: అల్ ఖదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను నిన్న పాకిస్తాన్ పారామిలిటరీ రేంజర్లు అరెస్ట్ చేశారు. ఇస్లామాబాద్ కోర్టు ఆవరణలోనే ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో 8 రోజుల రిమాండ్ విధించింది ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’(ఎన్ఏబీ) కోర్టు. 10 రోజుల రిమాండ్ కోరినప్పటికీ కోర్టు మాత్రం 8 రోజులకు మాత్రమే అనుమతించింది. ఇదిలా ఉంటే తనకు ప్రాణాహాని ఉందని ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు వెల్లడించారు. తన హత్యకు…