దబ్ల్యుఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్ పై మహిళా రెజర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఆరోపనపై విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు శుక్రవారం ప్రత్యేక కోర్టుకు తెలిపారు.
Gyanvapi mosque case:వారణాసిలోని జ్ఞానవాపి మసీదు విషయం గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తోంది. స్థానిక కోర్టు ఆదేశాలతో వీడియో రికార్డింగ్ చేస్తున్న సమయంలో మసీదులోని వాజుఖానాలోని కొలనులో ‘శివలింగం’ లాంటి నిర్మాణం లభించింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త దేశంలో చర్చనీయాంశంగా మారింది.
Karnataka Elections: కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. అయితే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ, మ్యాజిక్ ఫిగర్ 113 రాకపోవచ్చని, హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో మరోసారి జేడీఎస్ కింగ్ మేకర్ పాత్రను పోషించేందుకు సిద్ధం అయింది. అయితే ఇలాంటి పరిస్థితి వస్తే అధికారం ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమను సంప్రదించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు జేడీఎస్ చెబుతోంది. అయితే ఇటు బీజేపీ కానీ, అటు కాంగ్రెస్ కానీ జేడీయూ మాటల్ని…
Disney Hotstar: స్ట్రీమింగ్ దిగ్గజంగా ఉన్న డిస్నీ హాట్స్టార్ వేగంగా తన సబ్స్క్రైబర్లను కోల్పోతోంది. ముఖ్యంగా ఇండియాలో జియో సినిమా దెబ్బకు కుదేలవుతోంది. జియోసినిమా IPL స్ట్రీమింగ్ ని ఫ్రీగా అందించడంతో వినియోగదారులు ఎక్కువగా జియోసినిమాకు కనెక్ట్ అవుతున్నారు. తక్కువ సమయంలో జియోసినిమా ఎక్కువ ప్రజాధరణ పొందేందుకు ఇది కారణం అయింది. ఇది డిస్నీ హాట్స్టార్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆసియాలో డిస్నీ సబ్స్క్రైబర్ బేస్ వేగంగా క్షీణించింది. కేవలం మూడు నెలల్లో, స్ట్రీమింగ్ దిగ్గజం 4 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కోల్పోయింది.…
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టును అక్రమం అని నిన్న పాక్ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’(ఎన్ఏబీ)ని ఆదేశించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ రోజు ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
The Kerala Story: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ ది కేరళ స్టోరీ’ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. వివిధ రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపినా, వివిధ రాజకీయ పార్టీలు అడ్డంకులు సృష్టించినా సినిమా రూ.80 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు మూవీ మేకర్స్ చెబుతున్నారు.
Karnataka Elections: కర్ణాటక ఎన్నికల ఫలితాలకు మరికొన్ని గంటల సమయం ఉంది. రేపు మధ్యాహ్నం వరకు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో అనే స్పష్టత వస్తుంది. ఇదిలా ఉంటే తాము ఒంటరిగానే అధికారంలోకి వస్తామని మరోసారి ధీమా వ్యక్తం చేశారు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. పొత్తులపై ఊహాగానాలను తోసిపుచ్చారు. 224 మంది సభ్యుల అసెంబ్లీలో దాదాపు 150 సీట్లు గెలుస్తామని, మెజారిటీ మార్కు 113 కంటే ఎక్కువగా గెలుస్తామన్న పార్టీ అంచనాకు కట్టుబడి ఉన్నానని అన్నారు.
CBSE Class 10 Results: సీబీఎస్ఈ ఇంటర్మీడియల్ ఫలితాలు ప్రకటించిన కొద్ది సేపటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) గురువారం 10వ తరగతి ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది 93.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే 1.28 శాతం ఉత్తీర్ణత తగ్గింది.
Jammu Kashmir: తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ తన బుద్దిని మార్చుకోవడం లేదు. భారత్ లో, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులను బోర్డర్ దాటించేందుకు పాకిస్తాన్ ఆర్మీ సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
Tihar Jail: గ్యాంగ్స్టర్ టిల్లూ తాజ్పురియాను ప్రత్యర్థి ముఠా సభ్యులు తీహార్ జైలులో హత్య చేసిన కొన్ని రోజులకు కీలక పరిణామం సంభవించింది. 90 మందికి పైగా తీహార్ జైలు అధికారులను గురువారం ఉన్నతాధికారులు ట్రాన్స్పర్ చేశారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, హెడ్ వార్డర్లు, వార్డర్లు సహా 99 మంది అధికారులను బదిలీ చేస్తూ డైరెక్టర్ జనరల్ (జైళ్లు) సంజయ్ బెనివాల్ ఆదేశించారు. రాబోయే రోజుల్లో మరిన్ని బదిలీలు ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.