Elon Musk: ప్రపంచవ్యాప్తంగా 2.24 బిలియన్ల యూజర్లతో వాట్సాప్ అత్యధికంగా ఉపయోగించే మొబైల్ యాప్స్ లో ఒకటిగా ఉంది. అయితే దీనిపై ట్విట్టర్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాప్ యాక్టివ్ గా లేనప్పుడు కూడా వాట్సాప్ లోని మైక్రోఫోన్ యాక్సెస్ లోనే ఉంటుందని ఓ ఇంజనీర్ ట్విట్టర్ వేదిగా చేసిన ఆరోపణలపై ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించారు. ‘‘వాట్సాప్ ను నమ్మలేమని’’ ట్వీట్ చేశారు. వాట్సాప్ యూజ్ చేయన్నప్పుడు కూడా బ్యాక్‌గ్రౌండ్ లో మైక్రోఫోన్ యాక్సెస్ లోనే ఉంటుందని ఓ ఇంజనీర్ ఆరోపించాడు. తాను నిద్ర పోతున్నప్పుడు వాట్సాప్ మైక్రోఫోన్ ఆన్ అవుతుందని సోషల్ మీడియా వేదికగా ఆరోపించాడు.
Read Also: Extramarital Affair: ఒకరితో వివాహేతర సంబంధం.. మరొకరితో చనువు.. కట్ చేస్తే!
దానికి సంబంధించిన స్కీన్ షాట్స్ ను సదరు ఇంజనీర్ పంచుకున్నారు. దీనికి ప్రతిగా వాట్సాప్ ను విశ్వసించలేమని ఎలాన్ మస్క్ రీట్వీట్ చేశారు. త్వరలోనే ట్విట్టర్ ప్లాట్‌ఫామ్ లో వాయిస్ మెసేజెస్, వీడియో చాట్ ఆప్షన్లను తీసుకువస్తున్నట్టు మస్క్ వెల్లడించారు. వినియోగదారులు ప్రపంచంలోని ఎక్కడికైనా ఫోన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ ఆప్షన్ ను తీసుకువస్తే ఇదే ఫీచర్ అందిస్తున్న ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ కోవలోకి ట్విట్టర్‌ని తీసుకువస్తుంది.
అయితే ఈ వాట్సాప్ పై వచ్చిన ఆరోపనల్ని వాట్సాప్ తోసిపుచ్చింది. మైక్ సెట్టింగ్స్ పై యూజర్లకు పూర్తి కంట్రోల్ ఉంటుందని వెల్లడించింది. ఒకసారి పర్మిషన్ ఇస్తే వాట్సాప్ కాల్ చేస్తున్నప్పుడు, వాయిస్ నోట్, వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మాత్రమే మైక్ ను యాక్సెస్ చేస్తుందని స్పష్టం చేసింది. ఎలాంటి కమ్యూనికేషన్‌కైనా ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా రక్షించబడుతుందని స్పష్టం చేసింది.
WhatsApp cannot be trusted https://t.co/3gdNxZOLLy
— Elon Musk (@elonmusk) May 9, 2023