Gujarat: సూరత్ లో దారుణం చోటు చేసుకుంది. తనకు పెళ్లైందనే విషయాన్ని దాచి పెట్టి వేరే మహిళతో సంబంధాన్ని కొనసాగిస్తున్న ఓ వ్యక్తి సదరు మహిళపై దారుణంగా వ్యవహరించాడు. మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ఆమె పట్ల పైశాచికంగా వ్యవహరించాడు. నిందితుడు మహిళ ప్రైవేట్ పార్ట్స్ లో మిరపకాయలను దూర్చి చిత్రవధ చేశారు. ప్రాణాలతో బయటపడిన సదరు మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలోొ చికిత్స పొందుతోంది..
Read Also: Strange Incident: అంత్యక్రియల్లో విచిత్ర ఘటన.. చనిపోయిన భార్య కంట్లోంటి కన్నీళ్లు.. కట్ చేస్తే!
నికుంజ్ కుమార్ అమృత్ భాయ్ పటేల్ అనే నిందితుడికి అప్పటికే వివాహం అయింది. భార్య వేరే ఊరిలో ఉందనే విషయాన్ని దాచిపెట్టి మరో స్త్రీతో సంబంధాన్ని పెట్టుకున్నాడు. అయితే సదరు మహిళకు నిందితుడికి ఇంతకుముందే పెళ్లైన విషయం తెలిసింది. దీనిపై ఇద్దరు గొడవపడ్డారు. అప్పటి నుంచి ఆ మహిళ నిందితుడికి దూరంగా ఉంటోంది.
దూరంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని అమృత్ భాయ్ పటేల్ తన ప్రియురాలిని కేబుల్ వైర్లతో కొట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె పట్ల రాక్షసంగా వ్యవహరించాడు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ లోని మిరపకాయలను దూర్చి చిత్రవధ పెట్టాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరించాడు. ప్రాణాలతో భయటపడిన ఆమె తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అనంతరం ఓల్పాడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితుడిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి, ఐపీసీ 376 కింద కేసు నమోదు చేశారు.