Canada: కెనడాకు చెందిన ఓ మహిళ అత్యంత అరుదైన జబ్బుతో బాధపడుతోంది. ఏదైనా వ్యాయామం చేస్తే ఒళ్లంతా తీవ్రమైన అలర్జీతో బాధపడుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఫ్లైట్ ఎక్కేందుకు సమయం అయిపోతుండటంతో ఎయిర్ పోర్టులో పరిగెత్తి ప్రాణాలు మీదకు తెచ్చుకుంది. దాదాపుగా చనిపోయే స్థితికి చేరుకుంది. వివరాల్లోకి వెళితే కెనడాకు చెందిన 27 ఏళ్ల మహిళ డివ్ మంగత్ తన సోదరి, స్నేహితులతో కలిసి డొమెనికన్ రిపబ్లిక్ వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకుంది. అయితే ఫైట్ ఎక్కేందుకు టెర్మినల్ లో పరిగెత్తింది. దీంతో ఆమె సివియర్ రియాక్షన్ ఎదుర్కొంది.
Read Also: Hyderabad: వీడిన చాదర్‌ఘాట్ హత్య కేసు మిస్టరీ..
ఆమె గేట్ వరకు చేరుకున్న సమయంలో ఆమె ఒంటిపై దద్దుర్లు, ముఖం, పెదాలు వాచాయి. అలర్జీ కారణంగా శ్వాసతీసుకునేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంది. వెంటనే స్పందించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది యాంటి హిస్టామైన్ ట్యాబ్లెట్లు అందించారు. అవి కూడా పనిచేయలేదు. చివరకు ఎపిపెన్ ను తీసుకోవడంతో లక్షణాలు తగ్గాయి. కొన్ని నెలలుగా పరిగెత్తిన ప్రతీసారి, ఒత్తడికి గురైనప్పుడల్లా తన శరీరంపై విపరీతంగా దద్దర్లు వస్తున్నట్లు సదరు మహిళ వెల్లడించింది. ఇప్పటికే దీని చికిత్స కోసం చాలా ఆస్పత్రులకు వెళ్లానని ఆమె చెప్పింది.
వైద్యులు చెబుతున్న దాని ప్రకారం.. మంగత్ తీవ్రమైన అనాఫిలాక్సిస్ తో బాధపడుతున్నట్లు తెలిపారు. దీనికి చికిత్సగా ఎపినెఫ్రన్ అనే ఇంజెక్షన్ ను ఉపయోగిస్తుంటారు. వ్యాయామం వల్ల కలిగిగే అనాఫిలాక్సిస్, శారీరక శ్రమ ఎక్కువ అయినప్పుడు కనిపించే ఓ అరుదైన జబ్బుగా తెలిపారు. ఈ అలర్జీ వల్ల చర్మంపై దద్దుర్ల, పెదవులు వాపు, వికారం, వాంతులు, తీవ్రమైన సందర్భాల్లో రక్తపోటు, అనాఫిలాక్టిక్ షాక్ కు కారణం అవుతుంది.