Venu Goapl Reddy
Author- NTV Telugu-
S Jaishankar: ప్రపంచం మొత్తం భారతదేశం గురించి మాట్లాడుతోంది..
ప్రస్తుతం దేశంలోని ప్రజలకు ఆధార్, బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, సాంకేతికను ఉపయోగించడం వల్ల వివిధ రంగాల్లో దేశం అద్భుతమైన విజయాలను సాధించడంలో సహాయపడిందని అన్నారు. 10 ఏళ్లలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని భారతదేశం ప్రజల జీవితాలను మార్చడానికి అద్భుతాలు చేసిందని కొనియాడారు. ఆరోగ్యం, నీరు, విద్యుత్, ఇల్లు, విద్య వంటి భారతీయులు ఎదుర్కొనే అనేక సమస్యలు అభివృద్ధి చెందిన దేశాలతో సహా అనేక ఇతర దేశాలలో కూడా ఉన్నాయని అన్నారు. -
INDIA bloc: ఇండియా కూటమిలో లుకలుకలు.. కాంగ్రెస్‌పై జేడీయూ నేత ఆరోపణలు..
INDIA bloc: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీని, బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, ఆప్, డీఎంకే, టీఎంసీ, శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్) వంటి పార్టీలు కూటమిలో కీలకంగా ఉన్నాయి. అయితే గతేడాది కూటమి ఏర్పడినప్పటికీ.. ఇప్పటికీ సీట్ల షేరింగ్‌పై కసరత్తు పూర్తి కాలేదు. కూటమికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు సమావేశాలు జరిగాయి. అయినా సీట్లపై కసరత్తు కొలిక్కిరాలేదు. -
Jeffrey Epstein Files: ఎప్స్టీన్ ద్వీపానికి వెళ్లొచ్చిన రెండేళ్లకే టాప్ మోడల్ ఆత్మహత్య..
Jeffrey Epstein Files: జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణంలో ప్రముఖుల పేర్లు వస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వార్తలు హైలెట్ అవుతున్నాయి. యుక్త వయసులోని బాలికకు డబ్బు ఎరవేసి సెక్స్ ట్రాఫికింగ్ నిర్వహించినట్లు జెఫ్రీ ఎప్స్టీన్, అతని సహచరుడు మాక్స్ వెల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2002-2005 మధ్య ఎప్స్టీన్ ఫ్లోరిడాలోని తన ఇంటికి ఇలా యువతులను ఆహ్వానించి వారిపై లైంగిక దోపిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
Aditya-L1: ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్.. ప్రధాని నరేంద్ర మోడీ హర్షం..
Aditya-L1: సూర్యుడిపై అధ్యయనం చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిని ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతమైంది. 125 రోజలు పాటు అంతరిక్షంలో ప్రయాణించిన ఆదిత్య-L1 ప్రోబ్ విజయవంతంగా తనకు నిర్దేశించిన లాగ్రేజియన్ పాయింట్ 1(L1)లోకి ప్రవేశించింది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్1 హాలో కక్ష్యలోకి శాటిలైట్ విజయవంతంగా ప్రవేశించింది. -
Jeffrey Epstein Files: యూఎస్‌లో జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ప్రకంపనలు.. వెలుగులోకి హిల్లరీ క్లింటన్ పేరు..
Jeffrey Epstein Files: జెఫ్రీ ఎప్స్టీన్ హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణం అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలను రేపుతున్నాయి. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఫైల్స్ అమెరికాలోని ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లను బయటకు తెస్తోంది. ఇప్పటికే ఈ సెక్స్ స్కాండల్‌లో మాజీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా మూడో బ్యాచ్ అన్సీల్డ్ డాక్యుమెంట్లు నిన్న విడుదలయ్యాయి. -
AIIMS: 5 ఏళ్ల బాలిక మెలుకువగా ఉండగానే బ్రెయిన్ సర్జరీ.. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు..
AIIMS: ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఎంతో క్లిష్టమైన, అత్యంత అరుదైన సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. 5 ఏళ్ల బాలిక మెలుకువగా ఉండగానే బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. ఇలా ఇంత చిన్న వయసు ఇలాంటి సర్జరీ చేయించుకున్న వ్యక్తిగా ఈ ఐదేళ్ల చిన్నారి రికార్డుకెక్కింది. బాలిక మెదుడులోని ఎడమ పెరిసిల్వియన్ ఇంట్రాక్సియల్ బ్రెయిన్ ట్యూమర్‌ని తొలగించేందుకు ఆమె మెలుకువగా ఉండగానే క్రానియోటమీ (కాన్షియస్ సెడేషన్ టెక్నిక్) సర్జరీ జరిగింది. -
Hamas: “మహిళల్ని చుట్టుముట్టి ఒకరు రేప్ చేస్తుంటే, మిగతా వాళ్లు నవ్వారు”.. వెలుగులోకి హమాస్ అకృత్యాలు..
Hamas: హమాస్ ఉగ్రవాదుల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్ 7 నాటి దాడి సమయంలో మహిళలపై హమాస్ ఉగ్రవాదులు అత్యాచారాలకు పాల్పడుతూ, వారిని హత్యలు చేశారు. చిన్న పెద్దా, ముసలి వారనే తేడా లేకుండా హత్యలు చేశారు. చిన్న పిల్లల తలలను వేరు చేస్తూ రాక్షస ఆనందం పొందారు. ఆ దాడి సమయంలో జరిగిన సంఘటనల గురించి ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. సీఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బందీల్లో ఒకరైన రాజ్ కోహెన్ హమాస్ ఉగ్రవాదుల పైశాచికత్వాన్ని వెల్లడించారు. -
MLA Slaps Police: విధుల్లో ఉన్న పోలీస్‌పై చేయి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే..
MLA Slaps Police: విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారిపై ఎమ్మెల్యే చేయి చేసుకోవడం వివాదాస్పదం అయింది. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. పూణేలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై బీజేపీ ఎమ్యెల్యే చేయి చేసుకున్నారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఈ రోజు తెలిపారు. -
Alaska Airlines Boeing 737 MAX: 16 వేల అడుగుల ఎత్తులో ఊడిపోయిన విమానం డోర్..
Alaska Airlines Boeing 737 MAX: అలస్కా ఎయిర్ లైన్స్‌కి చెందిన బోయింగ్ 737-9 MAX విమానం తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. టేకాఫ్ అయిన కొద్ధి నిమిషాలకే గాలిలో ఉండగానే విమానం డోర్ తెరుచుకుంది. దీంతో విమానం ఒక్కసారిగా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది. ప్రయాణికులు ఈ ఘటనను చిత్రీకరించారు. దీంట్లో మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుంచి పూర్తిగా విడిపోయినట్లు కనిపిస్తోంది. -
Girls Missing: చిల్డ్రన్స్ హోమ్ నుంచి 26 మంది బాలికలు మిస్సింగ్.. మతమార్పిడి ఆరోపణలు..
Girls Missing: మధ్యప్రదేశ్ 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. రాజధాని భోపాల్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఓ అక్రమ షెల్టర్ హోమ్ నుంచి గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 26 మంది బాలికలు మిస్సైనట్లు అధికారులు తెలిపారు. బాలికల్లో ఎక్కువగా గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్‌లకు చెందిన వారు కాగా.. కొందరు మధ్యప్రదేశ్‌లోని సెహోర్, రైసెన్, చింద్వారా, బాలాఘాట్లకు చెందిన వారు ఉన్నారు.
తాజావార్తలు
-
Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
-
Virat Kohli Records: “నువ్వు మామూలోడివి కాదు సామీ”.. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
-
Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
ట్రెండింగ్
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!